Asianet News TeluguAsianet News Telugu

గొర్రెల మందలే మన బలం

సీఎం కేసీఆర్ తన దైన స్టైల్ లో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ కంపెనీల అడ్డమైన సలహాలు తీసుకోకుండా  కేవలం గొర్రెల ద్వారా రాష్ట్ర అభివృద్ధి ఏలా సాధ్యమో లెక్కలతో సహా వివరించారు.

KCR  says sheep represent the real wealth of Telangana

రాష్ట్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ కు ఉన్న విజన్, బంగారు తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహాలు గమనిస్తుంటే ప్రతిపక్షాలు కూడా పరేషాన్ అవుతన్నాయి.

ఏంతటి క్లిష్టమైన విషయానైనా చాలా చక్కగా చెప్పి, ఒప్పొంచే ఘనత కేసీఆర్ ది. నిన్నటి ప్రసంగంతో మారోసారి అది నిజమేనని నిరూపితమైంది.

 

బడ్జెట్ లో అన్ని కులాలకు భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో వివిధ కులసంఘాల నేతలు నిన్న ప్రగతి భవన్ వద్ద సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కులసంఘాల నేతలతో సీఎం తెలంగాణ అభివృద్ధిపై చర్చించారు. ముఖ్యంగా గొర్రెల పంపెకం రాష్ట్ర అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో చాలా చక్కగా వివరించారు.

 

అప్పట్లో సమైక్య రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం మెకన్సీ అనే అంతర్జాతీయ సంస్థ కు కోట్లు చెల్లించి విజన్ 2020 పేరుతో ఓ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయించాడు. కానీ, ఆ తర్వాత 9 ఏళ్లు ప్రతిపక్షానికే పరిమితమయ్యాడు.

 

అయితే, కేసీఆర్ అలాంటి పొరపాట్లు చేయకుండా తన దైన స్టైల్ లో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ కంపెనీలను కాకుండా కేవలం గొర్రెల ద్వారా రాష్ట్ర అభివృద్ధి ఏలా సాధ్యమో లెక్కలతో సహా వివరించారు.

 

గొర్రెల అభివృద్ధే యాదవుల అభివృద్ది అని యాదవుల అభివృద్దే తెలంగాణ అభివృద్ధి అని తన విజన్ ను మూడంటే మూడే ముక్కల్లో చక్కగా వివరించారు. అంతేకాదు తెలంగాణ కు ఆంధ్రా నుంచి గొర్రెలు రావడం బంద్ కావాలన్నారు.

‘తెలంగాణలో ఉండే ప్రతి కులం, ప్రతి మనిషి చిరునవ్వుతోటి, గర్వంతోటి కాలరెగరేయాలి.. అట్లా బతకాల.. ఉన్న వనరులు, ఉన్న వసతులు మనకు మిగులుబాటు రావాలి. యాదవ సోదరులు 30 లక్షల జనాభా ఉంది. ఫిష్ కానీ మీట్‌ కానీ దీనికి లోకల్‌ మార్కెట్‌ ఉంది. రాంనగర్‌ ఫిష్‌ మార్కెట్‌ కు ఆంధ్రా నుంచి రోజు 20, 30 లారీలు వస్తయి.. ఇవి ఎందుకు రావాలి..మనం ఉండగ.. మనం బయటకు ఎక్స్‌ ఫోర్ట్‌ చేయాల్సింది పోయి..

రోజు 350 లారీలు హైదరాబాద్‌కు వస్తుంటయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోకి రోజుకు 600 లారీల గొర్రెలు వస్తుంటయి.. ఎట్లస్తయి.. ఈ రోజు అవి వచ్చుడు బంద్‌ కావలె.. చిన్న లెక్క చెబుతా.. గొల్ల,కురుమ రెండు కులాలు ఉన్నయి.. డిపార్ట్ మెంట్‌ వాళ్లను లెక్కఅడిగితే తెలంగాణలో కోటి 25 లక్షల గొర్రెలు ఉన్నయని చెప్పిన్రు.. సమగ్ర సర్వే లెక్కతీస్తే 44 లక్షల గొర్రెలె ఉన్నయి... సర్వేనే నమ్మినం.. 88 లక్షలు కొనిఇస్తున్నాం.. కోటి 33 లక్షలు అవుతయి.. గెర్రెడు మూడు ఈతలు ఈనుతయి.. తక్కువ తక్కువ లెక్కపెట్టుకుంటే రెండు సంవత్సరాలలో తెలంగాణలో గొర్రెలు నాలుగున్నర కోట్లు అవుతయి.. ఒక యాభై లక్షలు తీసేస్తె గూడా నాలుగుకోట్ల గొర్రెలు మన యాదవ సోదరుల వద్ద ఉంటయి.. 5 వేల కాడికి ఒక గొర్రె అమ్ముకున్నా, 20వేల కోట్ల ఆస్తిమంతులు అవుతరు. 20 వేల కోట్ల రుపాయలు మన తెలంగాణలో మన యాదవ కులం వద్ద ఉంటే.. రాష్ట్రం అభివృద్ధికి ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరమే లేదు.’ అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios