Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ మాట తీరు మారిందా ?  అప్పుడలా.. ఇప్పుడిలా..

KCR : గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా ధైర్యంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చాలా నమ్మకంతో కనిపించేవారు. ఆయన మాట తీరు కూడా అలాగే ఉండేది. బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణకు చాలా నష్టం జరుగుతుందన్న విధంగా మాట్లాడేవారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అని అనేవారు. తాను తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుంటానని చాలా సార్లు చెప్పేవారు. 

KCR says No one can save Telangana if Congress, BJP comes to power KRJ
Author
First Published Apr 14, 2024, 3:05 PM IST

KCR : గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా ధైర్యంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చాలా నమ్మకంతో కనిపించేవారు. ఆయన మాట తీరు కూడా అలాగే ఉండేది. బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణకు చాలా నష్టం జరుగుతుందన్న విధంగా మాట్లాడేవారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అని అనేవారు. తాను తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుంటానని చాలా సార్లు చెప్పేవారు. 

కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మాట తీరులో చాలా మార్పు కనిపిస్తోంది. గతంలో మాట్లాడినంత ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ ను ప్రజలే కాపాడాకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. గతంలో.. తనకు తప్ప తెలంగాణను అభివృద్ధి చేసే సత్తా ఎవరికీ లేదని, రాష్ట్రం గురించి పూర్తి అవగాహన, చిత్త శుద్ది తనకే ఉందని చెప్పుకునేవారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేవారు.  

కానీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నాలుగు నెలల్లోనే బీఆర్ఎస్ ను బీజేపీ, కాంగ్రెస్ లు సగం ఖాళీ చేసేయడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కొన్ని సందర్భాల్లో మంత్రులకు, ముఖ్య నాయకులకు కూడా అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా, ఫామ్ హౌస్, ప్రగతి భవన్ దాటకుండా ఉన్నా కేసీఆర్ కు ఇప్పుడు సడెన్ గా ప్రజలు గుర్తుకు వచ్చారు. 

మండుతున్న ఎండలను కూడా లెక్క చేయకుండా మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు. పంట నష్టం జరిగిందనే కారణంతో రైతులను వెళ్లి పరామర్శిస్తున్నారు. వారిని ఓదారుస్తున్నారు. రైతులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. కొన్ని సందర్బాల్లో మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా కలవని ఆయన.. పార్టీలోని రెండో స్థాయి నాయకులను కూడా తన వద్దకు పిలిపించుకుంటున్నారు. అలాగే వారికి ఫోన్లు చేసి మరీ మాట్లాడుతున్నారంటే ఆయన మాట తీరులో ఎంత మార్పు వచ్చిందో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 

చాలా ఏళ్లుగా గెలుపు వల్ల వచ్చిన గర్వంతో ఉన్న బీఆర్ఎస్ అధినేతకు.. ఒక్క ఓటమి ఇంత మార్పు తీసుకొచ్చిందా అని ప్రజలతో పాటు ఆ పార్టీ కింది స్థాయి నాయకులు కూడా చర్చించుకుంటున్నారు. కానీ ఈ మార్పు కూడా ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదు. ఎన్నికల తరువాత చతికిలపడిపోయింది. ఒక వేళ ఆ పార్టీకి కాలం కలిసి వచ్చి మళ్లీ పూర్వ వైభవం వస్తే మాత్రం.. కేసీఆర్ తీరులో మళ్లీ మార్పు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మళ్లీ పాత కేసీఆరే కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేని విషయం. 

కానీ బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే బీఆర్ఎస్ కు పాత రోజుల తీసుకురావడానికి మాజీ సీఎం కేసీఆర్ చాలా కష్టపడుతున్నారు. అయితే ఆయన కంటే.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసే సొంత తప్పుల వల్లే బీఆర్ఎస్ కు అనుకూలమైన కాలం లభించి, మళ్లీ కేసీఆర్ సీఎం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కేసీఆర్ ను ఓడించిన కాంగ్రెస్సే.. ఆయనను మళ్లీ గెలిచేలా చేసి, సీఎం పీఠంపై కూర్చొపెట్టవచ్చు. కానీ అంత వరకు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios