కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రజలను బయటకు రానీయకుండా ఆంక్షలను విధిస్తు... జనసమ్మర్థమైన ప్రదేశాలను అన్ని దేశాల ప్రభుత్వాలు మూసివేసి కట్టుదిట్టమైన నివారణ చర్యలను తీసుకుంటున్నాయి అన్ని ప్రభుత్వాలు. 

భారతదేశంపై కూడా ఈ మహమ్మారి పంజా విసరడం ఆరంభించడంతో భారతప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేంద్రప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వైరస్ ని దేశం నుండి తరిమి కొట్టేందుకు పూనుకున్నాయి

Also read; కరోనాతో హైదరాబాద్ లో వ్యక్తి మృతి... అతనికి చికిత్స చేసిన డాక్టర్ కూడా...

తెలంగాణ సర్కార్ కూడా ఈ వైరస్ పై యుద్ధం ప్రకటించింది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూనే ప్రజలఅను కూడా అప్రమత్తం చేయడంతోపాటు తప్పుడు సమాచారాన్ని, పుకార్లను ప్రచారం చేస్తే కఠిన చర్యలను తీసుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే!

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిజిబింబిస్తు... హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ సైతం ఇలా వదంతులను ప్రచారం చేయకూడదని, చేస్తే ఎన్డీఎంఏ చట్టం కింద సంవత్సర కాలం పాటు జైలు శిక్షతోపాటు జరిమానాను కూడా విధించే ఆస్కారముందని తెలిపారు. 

ఆయన ఈ ట్వీట్ చేయగానే... నెటిజెన్ల తమదైన రీతిలో సెటైరికల్ గా కేసీఆర్ ని ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరోనా కు పారాసిటమాల్ వేస్తే సరిపోతుందన్న కేసీఆర్ వ్యాఖ్యను ప్రస్తావిస్తా... "సర్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు పారాసిటమాల్  వేసుకుంటే తగ్గుతుంది అనీ అసెంబ్లీలో లో చెప్పారు కదా సర్ తెలంగాణ ముఖ్యమంత్రి పై ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారు సర్?" అని ప్రశ్నించారు. 

ఈయన ఒక్కడే కాదు ఇలా చాలామంది తమదైన శైలిలో స్పందించారు. క్రియేటివిటీ కి పదును పెడుతూ.... ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొత్తానికి కేసీఆర్ గారు ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను దూరం చేయడానికి వారిలో ధైర్యాన్ని నింపడానికి అన్న మాట ఇప్పుడు ఇలా వైరల్ గా ప్రజలకు సెటైర్లు వేయడానికి పనికొస్తుంది.