తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీని రద్దుచేసి ముందస్తుకు సిద్దమయ్యారు. ముందస్తు ఎన్నికలకు అందరికంటే ముందస్తుగానే అభ్యర్థులను కూడా ప్రకటించారు.  మొత్తంగా 105 నియోజకవర్గాలకు టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న అభ్యర్థులను సీఎం ప్రకటించారు. అయితే ఇద్దరు సిట్టింగ్ లకు మరోసారి అవకాశం ఇవ్వకుండా సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని అందోల్ నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బాబుమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అతడి స్థానంలో స్థానిక జర్నలిస్ట్ చంటి క్రాంతి కిరణ్ కు టీఆర్ఎస్ టికెట్ ఖరారు చేశారు సీఎం. మరోవైపు చెన్నూరు నియోజకవర్గ ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ను కాదని ప్రస్తుత ఎంపి బాల్క సుమన్ కు టికెట్ ఖరారు చేశారు. 

ఇక మిగతాచోట్ల పాతవారినే కొనసాగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందోల్ నియోజకవర్గంలో స్థానికత సెంటింమెంట్ బలపడుతున్న నేపథ్యంలో జర్నలిస్ట్ క్రాంతి టికెట్ కేటాయించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.