ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారు:చండూరులో బీజేపీపై కేసీఆర్ ఫైర్

నలుగురు  ఎమ్మెల్యేలను ఢిల్లీ బ్రోకర్లు ప్రలోభాలకు గురి చేస్తే ఎడమ కాలితో తన్ని  బయటకు వచ్చారని సీఎం కేసీఆర్ చెప్పారు.దీనిపై విచారణ జరగాలన్నారు. 

KCR Reacts On Trying Trs MLAs poaching:

హైదరాబాద్:మొయినాబాద్ ఫాం హౌస్  లో నలగురు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు గురి చేసిన ఘటన వెనుక ఎవరున్నారో బయటకు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ  సీఎం కేసీఆర్  అభిప్రాయపడ్డారు.మునుగోడు  అసెంబ్లీ నియోజకవర్గంలోని  చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్  ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 

కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణా ఆత్మగౌరవాన్ని కొందామని వస్తే ఎడమకాలితో తన్ని వచ్చారన్నారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్టుగా నలుగురు ఎమ్మెల్యేలు  చెప్పారన్నారు. అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడారని కేసీఆర్  ఆ  నలుగురిని అభినందించారు.. 

ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక  ఎవరున్నారో ఒక్క క్షణం కూడ పదవుల్లో ఉండడానికి వీల్లేదని ఆయన  పరోక్షంగా మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల  కొనుగోలుకు మోడీ  ఎందుకు ప్రోత్సహిస్తున్నారో చెప్పాలన్నారు. మోడీ అండదండలు  లేకుండా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు హైద్రాబాద్ కు వచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారా  అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు  వందల కోట్లు  ఎక్కడి  నుండి  వచ్చాయని  ఆయన   ప్రశ్నించారు.  ఇంకా మీకు ఏం కావాలని  ఆయన  ప్రధాని  మోడీని  ప్రశ్నించారు.రెండు సార్లు  ప్రధానిగా బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఇలాంటి అరాచకాలను ఎందుకు  ప్రోత్సహిస్తున్నారో  చెప్పాలని  ఆయన ప్రశ్నించారు. ఇంత అరాచకం జరుగుతుంటే  మౌనంగా ఉందామా అని  ఆయన  అడిగారు.

20,30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ ను పడగొట్టాలని చూశారన్నారు. మునుగోడులో బీజేపీకి డిపాజిట్ వస్తే కేసీఆర్ ను పక్కకు జరుపుతారన్నారు.  అందుకే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.రాజకీయం  అంటే అమ్ముడుపోవడం కాదని తమ పార్టీ ఎమ్మెల్యేలు నిరూపించారన్నారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో వచ్చి చంచల్  గూడ  జైలులో ఉన్నారని కేసీఆర్ చెప్పారు.ఎమ్మెల్యేల  కొనుగోళ్ల వ్యవహరంలో మీరు చూసింది చిన్నదేనన్నారు. చూడాల్సింది ఇంకా చాలా ఉందని కేసీఆర్  చెప్పారు.ఢిల్లీ పీఠం బద్దలవ్వాల్సింది చాలా  ఉందని కేసీఆర్  తెలిపారు.రాబోయే రోజుల్లో అన్నీ విషయాలు బయటపడతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఈ కేసు  కోర్టులో ఉన్నందున తాను  ఈ విషయమై ఎక్కువగా  మాట్లాడబోనన్నారు.

ఢిల్లీ పీఠం అదిరిపోయే పరిస్థితి ఉందన్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేస్తున్నారన్నారు.ఇలాంటి వారిని బంగాళాఖాతంలో విసిరివేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. ఏం జరిగిందో  తెలిసిన తర్వాత కూడా .తలమాసినవాడొకడు తడిబట్టలతో  ప్రమాణం అంటున్నాడని బండి సంజయ్ పై కేసీఆర్ మండిపడ్డాడు.

పాలను,నీళ్లను వేరు చేసి చూడాలని ఆయన ప్రజలను కోరారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు వ్యతిరేకంగా అనేక పథకాలను తెస్తుందన్నారు. అలాంటి పథకాలను  లెఫ్ట్  పార్టీలతో కలిపి టీఆర్ఎస్ అడ్డుకుంటుందని కేసీఆర్ చెప్పారు.ఈ దుగ్దతోనే  తనను పక్కకు జరిపితే తమ ఆగాడాలు సాగించవచ్చని బీజేపీ భావించిందని కేసీఆర్ విమర్శించారు.  ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారన్నారు.

కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో విద్యుత్ ,నీళ్లు ప్రజలకు రావన్నారు.విద్యుత్, నీళ్లు అందుబాటులో ఉన్నా కూడ కేంద్ర ప్రభుత్వం అసమర్ధత కారణంగా ప్రజలకు అందడం లేదన్నారు. తెలంగాణలో మాదిరిగానే దేశాన్ని అభివృద్ది  చేయడం కోసమే బీఆర్ఎస్ పుట్టుకొచ్చిందని కేసీఆర్ చెప్పారు. వంద పడకల ఆసుపత్రి,  రెవిన్యూ డివిజన్ వంటి పనులు చాలా చిన్నవన్నారు. మునుగోడులో ప్రభాకర్  రెడ్డిని గెలిపిస్తే మునుగోడు సమస్యలు తీరుతాయని  ఆయన హామీ  ఇచ్చారు .గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ప్రజలకు కన్పించకుండా  పోయినా  ఓడినా  కూడా ప్రభాకర్ రెడ్డి  ప్రజల్లోనే ఉన్నారని కేసీఆర్ గుర్తు చేశారు.

also read:మునుగోడులో టీఆర్ఎస్‌ను గెలిపించి మోడీకి బుద్ది చెప్పాలి: చండూరులో సభలో సీపీఐ నేత కూనంనేని

మోడీ విశ్వ గురువా ,విష గురువా అని ఆయన సెటైర్లు వేశారు.బీజేపీ వాళ్లదంతా ఆడంబరమేనని కేసీఆర్ చెప్పారు.ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న చేనేత కార్మికులపై 5 శాతం జీఎస్టీ విధించి మోడీ ప్రభుత్వం మరిన్ని  ఇబ్బందులకు గురి చేసిందని కేసీఆర్ విమర్శించారు.న్యాయమేమిటో, ధర్మమేమిటో ప్రజలకు తెలుసుననన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios