నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ సీటు ఆశించిన కోటిరెడ్డికి  ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.


హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ సీటు ఆశించిన కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్యకు టీఆర్ఎస్ సీటు కేటాయించింది. అయితే ఈ స్థానాన్ని ఆశించిన టీఆర్ఎస్ కు చెందిన మరో నేత కోటిరెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.

also read:నాగార్జునసాగర్ బైపోల్: మండలాలకు టీఆర్ఎస్ ఇంచార్జీలు వీరే

ఈ సీటును ఆశించిన కోటిరెడ్డిని సీఎం కేసీఆర్ బుజ్జగించారు. ఎమ్మెల్సీ సీటు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. నోముల భగత్‌ విజయం కోసం సహకరించాలని ఆయన కోరారు.నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది