అమరావతి:  డిసెంబర్ రెండో వారంలో కేంద్రానికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

బుధవారం నాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పలు విషయాలపై ఆయన మాట్లాడారు,

 

 డిసెంబర్ రెండో వారంలో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు.ఈ విషయమై పలు పార్టీల అధ్యక్షులు, సీఎంలతో చర్చించినట్టుగా కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో ఇవాళ నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని తెలిపారు.

బుధవారం నాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పలు విషయాలపై ఆయన మాట్లాడారు,కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఇటీవల కాలంలో కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

రాష్ట్రప్రభుత్వాల హక్కులను కేంద్రం హరించివేస్తోందని టీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ సమావేశం నిర్వహించాలని తలపెట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

ఇప్పటికే 10 పార్టీల అధ్యక్షులతో పాటు విపక్షపార్టీలకు చెందిన ముఖ్యమంత్రులతో కూడ చర్చించినట్టుగా ఆయన ఈ సమావేశంలో వెల్లడించారు.రాష్ట్రాలకు నిధులు, రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై  కేంద్ర విధానాలపై  కేసీఆర్ పోరుబాట పట్టే అవకాశం ఉంది.ఈ పోరుబాటకు ఈ సమావేశం నాంది పలకనుంది.

హైద్రాబాద్ లో  అభివృద్ది గురించి ఈ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించారు. ఈ అంశాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రస్తావించాలని చెప్పారు.హైద్రాబాద్ లో వేలాది కోట్లతో అభివృద్ధి పనులను చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

గతంలో వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో కూడ ప్రభుత్వరంగ  సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించిన విషయాన్ని ప్రస్తావించారు. మోడీ ప్రభుత్వం కూడ ఇదే విధానాన్ని అవలంభిస్తుందని ఆయన వివరించారు.