Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ బీజేపీ: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకి కేసీఆర్ కసరత్తు

బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు కోసం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రయత్నాలను ప్రారంభించారు. వరుసగా పలు పార్టీల నేతలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ మంతనాలు చేస్తున్నారు.
 

KCR plans to  Federal Front for 2024 General Elections
Author
Hyderabad, First Published Jan 12, 2022, 12:03 PM IST

హైదరాబాద్: దేశంలో Bjp, Congress వ్యతిరేక పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటుకు Trs  చీఫ్ kcr ప్రయత్నాలు ప్రారంభించారు. లెఫ్ట్ పార్టీలతో పాటు ఇతర పార్టీలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో కేసీఆర్ పలు పార్టీలతో వరుస భేటీలు నిర్వహించడం చర్చకు దారితీసింది.

గత వారంలో cpi సీపీఎం జాతీయ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సీపీఐ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, cpmజాతీయ ప్రధాన కార్యదర్శి Sitaram Yechury ఏచూరిలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సీపీఎం అగ్రనేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
జాతీయ రాజకీయాలపై ఈ సమావేశంలో కేసీఆర్ లెఫ్ట్ పార్టీల నేతలతో చర్చించారు. ఈ భేటీ ముగిసిన నాలుగైదు రోజుల తర్వాత Rjd నేత తేజస్వి యాదవ్ తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. తేజస్వియాదవ్  పాట్నా నుండి Hyderabad కు చేరుకొన్నారు. Tejashwi yadav తో కేసీఆర్ భేటీ అయ్యారు. తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో కూడా కేసీఆర్  ఫోన్ లో చర్చించారు.

గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకొంది. వరి ధాన్యం అంశాన్ని టీఆర్ఎస్ తెరమీదికి తీసుకొచ్చింది. వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం సహకరించడం లేదని టీఆర్ఎస్ సర్కార్ ఆరోపించింది. యాసంగిలో Paddy ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని కూడా కేసీఆర్ ప్రకటించారు. మరో వైపు వర్షాకాలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో టీఆర్ఎస్ సర్కార్ సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎదురు దాడికి దిగింది. ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు గాను  మంత్రుల బృందం కూడా ఢిల్లీలో వారం రోజులుగా మకాం వేసింది.  ఆ తర్వాత బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ పార్టీలతో సమావేశాలు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకు కేంద్రం వెనుకాడడం లేదని కూడా టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. 

ఈ విషయమై కేంద్రం తీరుపై అసంతృప్తితో ఉన్న పార్టీలను కూడగట్టే పనిలో కేసీఆర్ ఉన్నారు. గత ఏడాదిలో తమిళనాడు పర్యటనకు వెళ్లిన సమయంలో తమిళనాడు సీఎం Stalin  తో కూడా కేసీఆర్ సమావేశమయ్యారు.  కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అంతకుముందే Tamilnadu సీఎం స్టాలిన్ బీజేపీయేతర పార్టీల సీఎంలకు లేఖలు రాశారు.ఈ లేఖల ప్రతులను సీఎం కేసీఆర్ కు Dmk ప్రతినిధుల బృందం అందించింది.

2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా సీఎం కేసీఆర్ federal front  ఏర్పాటుకు ప్రయత్నించారు. బెంగాల్ సీఎం మమత mamata banerjee పాటు, కేరళ సీఎం పినరయి విజయన్ తో కేసీఆర్ చర్చించారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష మెజారిటీతో విజయం సాధించింది. దీంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్య పడలేదు. అదే మరోసారి ఈ ప్రయత్నాలను కేసీఆర్ ప్రారంభించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios