ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌  ఫోన్ చేశారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడం పట్ల కేసీఆర్ జగన్‌ను అభినందించారు.


హైదరాబాద్: ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫోన్ చేశారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడం పట్ల కేసీఆర్ జగన్‌ను అభినందించారు.

ఏపీలో జగన్ నేతృత్వంలో వైసీపీ అద్భుత విజయం సాధించడంపై కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ రాష్ట్రం ముందడుగు వేస్తోందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగు అవుతాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మరో వైపు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ఘన విజయం సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అభినందనలు తెలిపారు. మోడీ నేతృత్వంలో దేశం మరింత ముందుకు పోవాలని కేసీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.