తెలంగాణ ప్రభుత్వం గర్భిణులు రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేలా చేసేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనుంది. రేపటి నుంచే ఈ కిట్లను పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం గర్భిణులు రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేలా చేసేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనుంది. రేపటి నుంచే ఈ కిట్లను పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. తొలుత 9 జిల్లాలో గర్భిణుల సంపూర్ణ ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్‌ను ప్రభుత్వం అందజేయనుంది. ఈ 9 జిల్లాల జాబితాలో గర్భిణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే గర్భిణులకు ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్‌లకు పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం అని ప్రభుత్వం తెలిపింది.
బుధవారం వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు కామారెడ్డి నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో స్థానిక మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్‌ల పంపిణీ ద్వారా.. తొమ్మిది జిల్లాల్లో మొత్తం 1.50 లక్షల మంది గర్భిణులు నేరుగా లబ్ధి పొందనున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. రూ. 50 కోట్ల వ్యయంతో మొత్తం 2.50 లక్షల కిట్‌లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లలో.. న్యూట్రీషన్ కిట్లలో.. కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ 3 బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి, ఆల్‌బెండజోల్ టాబ్లెట్, కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ ఉండనున్నాయి.