Asianet News TeluguAsianet News Telugu

మోడీతో సీఎం కేసీఆర్ భేటీ: రాష్ట్ర సమస్యలపై చర్చ

రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని తతెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని కోరారు. రెండో దఫా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారి కలిశారు.               

kcr meets prime minister narendra modi
Author
Hyderabad, First Published Oct 4, 2019, 5:30 PM IST

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో  భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై సీఎం కేసీఆర్ వినతిపత్రం సమర్పించనున్నారు.

కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ లు రెండో దఫా అధికారంలోకి వచ్చారు. అయితే వీరిద్దరూ ముఖాముఖి కలవడం ఇదే ప్రథమం. గతంలో పలుమార్లు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చినప్పటికీ కూడ కేసీఆర్  ప్రధాని మోడీతో భేటీ కాలేదు. 

kcr meets prime minister narendra modi

రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఏపీ పునర్విభజన సమస్యలపై కూడ సీఎం కేసీఆర్ మోడీతో చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్ కోరుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటి విడుదల అయింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు కాకపోతే మరేదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని  మోడీని సీఎం కేసీఆర్ కోరనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై కూడ సీఎం కేసీఆర్ మోడీతో చర్చిస్తారు.

గోదావరి నదీ జలాలను కృష్ణా నదికి తరలించడం కోసం రెండు రాష్ట్రాలకు చెందిన సీఎంల మధ్య చర్చలు జరిగాయి. మరో వైపు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించి నిధులు ఇవ్వాలని  కూడ మరోసారి ప్రధాని మోడీని కోరే అవకాశం ఉంది.ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి  అమిత్ షాతో  సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios