గన్నవరం చేరుకున్న కేసీఆర్: స్వాగతం పలికిన దేవినేని ఉమ

KCR leaves for Vijayawada
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హైదరాబాదు నుంచి విజయవాడకు బయలుదేరారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హైదరాబాదు నుంచి విజయవాడకు బయలుదేరారు. దుర్గామాతకు ముక్కు పుడక సమర్పించుకోవడానికి ఆయన విజయవాడ వెళ్లారు.

ఆయన తన కటుంబ సభ్యులతో సహా మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు స్వాగతం చెప్పారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి వెటర్నరీ కళాశాల అతిథి గృహానికి వెళ్తారు. అక్కడి నుండి ఆయన దుర్గామాత ఆలయానికి వెళ్లి ముక్కుపుడక సమర్పించుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముక్కు పుడక సమర్పించుకుంటానని కేసీఆర్ ఉద్యమ కాలంలో మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకోవడానికి ఆయన విజయవాడకు వెళ్తున్నారు.

ఇంద్రకీలాద్రిపైకి కేసీఆర్ అభిమానులు చేరుకున్నారు. ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను తొలగించాలని పోలీసులు సూచించారు. అభిమానులు టీఆర్ఎస్ జెండాలు కూడా పట్టుకొచ్చారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కొండపైన రాజకీయ నినాదాలు చేయవద్దని కూడా చెప్పారు. 

 

"

loader