Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సాధించినట్టే దళితబంధును విజయవంతం చేస్తా: కరీంనగర్ రివ్యూలో కేసీఆర్


తన చివరి రక్తం బొట్టు వరకు దళితబంధు పథకం విజయవంతం కోసం ప్రయత్నిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. దళితబంధుపై కరీంనగర్ కలెక్టరే‌ట్ లో శుక్రవారం నాడు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

KCR interesting comments on Dalitha bandhu scheme in Karimnagar review
Author
Karimnagar, First Published Aug 27, 2021, 3:57 PM IST


కరీంనగర్:దళితులు పేదరికంలో మగ్గడానికి సామాజిక వివక్షే కారణమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంపై సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు కరీంనగర్ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. 

also read:దళితబంథు: కరీంనగర్‌లో అధికారులతో కేసీఆర్ సమీక్ష

చివరి రక్తం బొట్టు వరకు దళితుల అభివృద్ది కోసం పోరాటం చేస్తానని  కేసీఆర్ తేల్చి చెప్పారు. దళితబంధును విజయవంతం చేసి తీరుతానని సీఎం చెప్పారు. తెలంగాణ సాధించినట్టే దళితబంధును కూడా అమలు చేస్తానని కేసీఆర్ తెలిపారు. 

దళితుల పట్ల సమాజం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆయన  అభిప్రాయపడ్డారు.పట్టుబడితే సాధించలేనిదేమీ లేదన్నారు.  ఎప్పటి నుండి  అనుకొంటున్న దళిత అభివృద్ది కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చిందని కేసీఆర్ చెప్పారు.సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్నితాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

రైతు బంధు, రైతు భీమాతో రైతులకు ఉపశమనాన్ని కలిగించినట్టుగా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అన్ని రంగాల్లో గాడి తప్పిన తెలంగాణ నేడు ఓ దరికి  చేరుకుందన్నారు కేసీఆర్. బీడికార్మికులు, ఒంటరి మహిళలకు, బోధకాలు ఉన్న బాధితులకు  పెన్షన్ అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణేనని సీఎం కేసీఆర్ తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios