Asianet News TeluguAsianet News Telugu

దళితబంథు: కరీంనగర్‌లో అధికారులతో కేసీఆర్ సమీక్ష

దళితబంధు పథకంపై తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు  కరీంనగర్ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు. దళితబంథు పథకాన్ని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఈ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవలనే విడుదల చేసింది.

Telangana CM KCR Review on Dalitha Bandhu scheme in Karimnagar
Author
Karimnagar, First Published Aug 27, 2021, 1:24 PM IST

కరీంనగర్:   దళిత బంథు పథకంపై తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి అధికారులు, మంత్రులు హరీశ్​రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు హజరయ్యారు. పథకం అమలుపై అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటికే ఈ పథకం కింద నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల వారీగా విడుదల చేసింది. ఇప్పటికే రూ. 2 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు బదిలీ చేసింది ప్రభుత్వం.ఈ పథకం కింద నిధులను వినియోగించుకొనే విషయమై మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.  

ఈ నెల 16వ తేదీన  కరీంనగర్ లోని శాలపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దళితబంథు పథకాన్ని  లాంఛనంగా ప్రారంభించారు. ఆ సమయంలో నిర్వహించిన సభలో మరోసారి తాను కరీంనగర్ కు వచ్చి దళితబంధు పథకంపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు.ఈ హామీలో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్ సమావేశమందిరంలో దళితబంధుపై సమీక్ష నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం హూజురాబాద్ ను ఈ పథకం కోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios