Asianet News TeluguAsianet News Telugu

మరో ఐదేళ్లు కావాలా?: యాదాద్రి నిర్మాణ పనులపై కేసీఆర్ అసంతృప్తి

యాదాద్రి నిర్మాణ పనులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులపై కేసీఆర్ మండిపడ్డారు. పనులు పూర్తి చేసేందుకు ఎంత కాలం పడుతోందని ఆయన ప్రశ్నించారు.

kcr inspects yadadri temple works
Author
Hyderabad, First Published Aug 17, 2019, 6:19 PM IST

యాదాద్రి: యాదాద్రి పనులు నత్తనడకన సాగుతుండడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేయడానికి మరో ఐదేళ్లు తీసుకొంటారా అని ఆయన ప్రశ్నించారు.

శనివారం నాడు యాదాద్రి క్షేత్రంలో పనుల  పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం స్థానిక హరిత హోటల్ లో అధికారులతో యాదాద్రి పనుల పై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఎ

ప్పటిలోపుగా పనులు పూర్తి చేస్తారని సీఎం అధికారులను ప్రశ్నించారు. మరో ఐదేళ్లు సమయం కావాలా అని ఆయన ప్రశ్నించారు. ఆలయ అభివృద్దికి సంబంధించి రూ. 473 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్టుగా అధికారులు గుర్తు చేశారు.
  
ఆర్ధిక శాఖ కార్యదర్శితో మాట్లాడి వెంటనే నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతామన్నారు.ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. 

యాడాకు మరో ఉన్నతాధికారిని కూడ నియమించనున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు.  ఆర్ అండ్ బీ పనులను పర్యవేక్షించేందుకు  సీఈ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios