యాదగిరిగుట్ట: తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రికి ఆదివారం నాడు  చేరుకొన్నారు. యాదాద్రి వద్ద  జరుగుతున్న పనులను కేసీఆర్ పరిశీలించారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదాద్రికి  చేరుకొన్నారు.యాదాద్రి వద్ద  ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.

తొలుత సీఎం కేసీఆర్ శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకొన్నారు. ఆలయ అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు.  తెలంగాణ సీఎంగా రెండో దఫా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  సీఎం కేసీఆర్ తొలిసారిగా యాదగిరిగుట్టకు  వచ్చారు.
"