హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్   ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని  ఆయన వ్యక్తిగత  వైద్యుడు  డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. సోమవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  

ఆదివారం నాడు సీఎం కేసీఆర్ ను పరీక్షించినట్టుగా చెప్పారు. స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులున్నాయని ఆయన తెలిపారు.  యాంటిజెన్ టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు.  ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడ నిర్వహించినట్టుగా ఆయన తెలిపారు.   కేసీఆర్ కు స్వల్ప లక్షణాలు ఉన్నాయన్నారు.  

also read:కేసీఆర్‌కి కరోనా: హోం క్వారంటైన్‌లో తెలంగాణ సీఎం

హోం ఐసోలేషన్ లో ఉంటే సరిపోతోందన్నారు. ఇవాళ రాత్రిపూట  ఓ డాక్టర్ తో పాటు నర్సు  కేసీఆర్ కు  చికిత్స చేసేందుకు  ఫాం హౌస్ లో అందుబాటులో ఉన్నారు. అవసరమైతేనే ఆయనను  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తామన్నారు.    కేసీఆర్ కు జ్వరం, ఒళ్లు నొప్పులు కూడ తగ్గాయన్నారు.  కేసీఆర్ కటుంబసభ్యులతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బందికి కూడ పరీక్షలు నిర్వహించారు. అయితే ఎవరికీ కూడ  కరోనా సోకలేదని  ఎంవీ రావు చెప్పారు. .