హైదరాబాద్: ఆర్టీసీ విషయంలో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలతో కూడిన కమిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆర్టీసీ విషయంలో  లేబర్ కమిషనర్‌కు అప్పగించాలని  హైకోర్టు కోరింది.

Also Read:సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ: హైకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న అశ్వత్థామరెడ్డి....

ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం ముగ్గురు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలతో  కమిటీని ఏర్పాటు చేస్తామని  తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పింది. అయితే  ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం  అభిప్రాయం చెప్పాలని  ఈ నెల 12 వ తేదీన  తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్‌ను కోరింది.

Also Read: సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తాం: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు...

హైకోర్టు అభిప్రాయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ చెప్పారు. హైకోర్టు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ఆర్టీసీ అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు.

హైకోర్టు ప్రతిపాదనలపై తమ అభిప్రాయాన్ని తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్‌కె జోషీ బుధవారం నాడు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేయదల్చిన  సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల కమిటీపై తెలంగాణ ప్రభుత్వం విముఖతను చూపింది. ఈ విషయమై లేబర్ కమిసనర్‌కు  అప్పగించాలని  తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది.  ఆర్టీసీ సమ్మెతో పాటు ఆర్టీసీ ప్రైవేటీకరణ విషయమై బుధవారం నాడు మధ్యాహ్నం నాడు  హైకోర్టులో విచారణ జరగనుంది.