తెలంగాణ భవన్ లో కెసిఆర్ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో ఇంత బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. 

ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలకు పాల్పడ్డారని, కెసిఆర్ ఆరోపించారు. వారి నోళ్లకు అడ్డు ఆపు లేకుండా మాట్లాడారని కెసిఆర్ అన్నారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండడం నిజంగా బాధాకరం అని అన్నారు. 

వారి నోర్లతో అన్ని పచ్చి అబద్జలు మాట్లాడారని, ఇంకో అడుగు ముందుకేసి తన ముక్కు కోస్తా అని కూడా మాట్లాడుతున్నారని కెసిఆర్ విచారం వ్యక్తం చేసారు. ప్రజలు నేడు ఈ ప్రతిపక్షాల పిచ్చి కూతలు పట్టించుకోవద్దని తీర్పునిచ్చారని ఆయన అన్నారు. 

ఇలా పిచ్చి కూతలు కూస్తున్న వాళ్ళ నోళ్లకు మొక్కలని అన్నారు. కొన్ని కుక్కలు నిరంతరం మొరుగుతున్నాయని ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేసారు. సోషల్ మీడియాలో అయితే వారి మాటలకు అడ్డు ఆపు లేకుండా పోయిందని అన్నారు. 

సోషల్ మీడియానా అది అంటి సోషల్ మీడియానా అర్థం కావడం లేదని అన్నారు. ఇలా సోషల్ మీడియాలో హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలని కేసీర్ హితవు పలికారు. ప్రతిపక్షం హుందాగా వ్యవహరించాలని ఆయన అన్నారు.