పాలమూరులో 14 సీట్లు గెలవాలి: నాగం మంచి స్నేహితుడన్న కేసీఆర్

పాలమూరు జిల్లాలో  నాగం జనార్ధన్ రెడ్డి  సేవలను ఉపయోగించుకోవాలని ఆయన  కోరారు.

KCR Directs party leaders To utilize Nagam Janardhan Reddy suggestions in Mahabubnagar lns

హైదరాబాద్: మహబూబ్ నగర్  జిల్లాలోని  14 సీట్లు గెలవాల్సిన అవసరం ఉందని  తెలంగాణ సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు. ఇందుకు మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి నుండి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆయన  పార్టీ నేతలకు సలహా ఇచ్చారు. 

మంగళవారంనాడు  తెలంగాణ భవన్ లో  నాగం జనార్ధన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు  బీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో  కేసీఆర్ ప్రసంగించారు. 

1969 తెలంగాణ ఉద్యమంలో నాగం జనార్దన్ రెడ్డి  జైలుకు వెళ్లారని కేసీఆర్ గుర్తు చేశారు. తనకు వ్యక్తిగతంగా నాగం జనార్ధన్ రెడ్డి మంచి మిత్రుడని ఆయన చెప్పారు.నాగం జనార్ధన్ రెడ్డి వంటి పాలమూరు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పనికొస్తారన్నారు.  నాగం జనార్ధన్ రెడ్డి  సలహాలు, సూచనలు తీసుకోవాలని పార్టీ నేతలకు  కేసీఆర్ సూచించారు. నాగం జనార్ధన్ రెడ్డితో గతంలో తాను కలిసి పనిచేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

హైద్రాబాద్ లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపినాథ్  మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ తో కలిసి పనిచేయాలని ఆయన కోరారు.పాత, కొత్త నేతలు కలిసి పనిచేయాలన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి పీజేఆర్ తనకు స్నేహితుడని కేసీఆర్ గుర్తు చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి  భవిష్యత్తును తనకు వదిలేయాలని ఆయన కోరారు.  

also read:బీఆర్ఎస్‌లో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి: గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్దిలో ముందుకు పోతుంది. తెలంగాణ ఏర్పాటు కాకముందు  ఆ తర్వాత  పరిణామాలను  పరిశీలించాలని ఆయన కోరారు.మెదక్  ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి కేసీఆర్ ప్రస్తావించారు.  భగవంతుడి దయ వల్ల  ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదన్నారు కేసీఆర్.

నాగర్ కర్నూల్  అసెంబ్లీ నుండి కాంగ్రెస్ టిక్కెట్టును నాగం జనార్ధన్ రెడ్డి ఆశించారు. ఈ స్థానం నుండి  నాగం జనార్ధన్ రెడ్డికి కాకుండా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించింది. కాంగ్రెస్. దీంతో  నాగం జనార్ధన్ రెడ్డి  కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.  బీఆర్ఎస్ లో చేరాలని  కేటీఆర్, హరీష్ రావులు  రెండు రోజుల క్రితం ఆహ్వానించారు. దీంతో  నాగం జనార్ధన్ రెడ్డి  బీఆర్ఎస్ లో ఇవాళ చేరారు.  జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టిక్కెట్టును విష్ణువర్ధన్ రెడ్డి ఆశించారు.ఈ స్థానంలో అజహరుద్దీన్ కు టిక్కెట్టు దక్కింది. దీంతో  విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios