బ్రిజేష్ ట్రిబ్యునల్ తో తెలంగాణకు అన్యాయం:కేసీఆర్

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 27, Aug 2018, 7:06 PM IST
KCR demands to solve water dispute
Highlights

 కృష్ణా నదీ జలాల వివాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కృష్ణా నదీజలాల వివాదాన్ని వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్ కు అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

ఢిల్లీ: కృష్ణా నదీ జలాల వివాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కృష్ణా నదీజలాల వివాదాన్ని వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్ కు అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అంతరాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం ప్రకారం  కృష్ణా బేసిన్ లో  నదీ జలాల పున:పంపిణీ జరగాలని కోరారు. 

బ్రిజేష్ ట్రిబ్యూనల్ తో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. అటు గోదావరి నదిపై సీతారామ ప్రాజెక్టు కొత్తది కాదన్న సీఎం దీనిపై కేంద్ర జల సంఘం ఆదేశాలు ఇవ్వాలని కోరారు.నదీ జలాల వివాదాలను సత్వరమే పరిష్కరించాలని ఆయన కోరారు. 

loader