Asianet News TeluguAsianet News Telugu

ఖమ్మంలో ఐదు లక్షల మందితో బీఆర్ఎస్ భారీ సభ: మూడు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం


ఈ నెల  18న ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయమై   ఖమ్మం జిల్లాకు  చెందిన బీఆర్ఎస్  ప్రజా ప్రతినిధులతో  కేసీఆర్  ఇవాళ  చర్చించారు. 

  KCR  Decides  To  invite three state  CMs  for  Khammam BRS  Sabha on Jan 18
Author
First Published Jan 9, 2023, 8:30 PM IST

హైదరాబాద్: ఈ నెల  18న  ఐదు లక్షల  మందితో  బహిరంగ సభ  నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నారు.ఈ సభకు  మూడు రాష్ట్రాల సీఎంలకు  ఆహ్వానం పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి  ఖమ్మం జిల్లాకు చెందిన  బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో  కేసీఆర్ సోమవారం నాడు సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా  మార్చిన తర్వాత ఖమ్మంలో  సభను ఏర్పాటు  చేస్తున్నారు. దీంతో  ఈ సభను  విజయవంతం చేయాలని  పార్టీ ప్రజా ప్రతినిధులకు  కేసీఆర్ సూచించారు.  ఖమ్మం జిల్లా  ఏపీ రాష్ట్రానికి సరిహద్దులో  ఉంటుంది.  దీంతో  ఏపీ రాష్ట్రం నుండి  ఈ సభకు  జనాన్ని సమీకరించాలని  కూడా  పార్టీ నేతలకు  కేసీఆర్  సూచించారు.   ఈ సభకు  ఖమ్మంతో పాటు  సమీపంలోనే  ఉన్న నల్గొండ, సూర్యాపేట జిల్లాల  నుండి  జన సమీకరణ చేసే అవకాశంపై  కూడా  ఈ సమావేశంలో   చర్చకు  వచ్చినట్టుగా సమాచారం.  ఇవాళ మధ్యాహ్నం  ఖమ్మం జిల్లాకు చెందిన  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా  ఆ జిల్లా కు చెందిన  ప్రజా ప్రతినిధులు  సమావేశానికి హజరయ్యారు.  ఖమ్మం బహిరంగ స భ బాధ్యతలను  మంత్రులు  పువ్వాడ అజయ్ కుమార్ ,  హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డికి  కేసీఆర్ అప్పగించారు. ఈ సభలో  బీఆర్ఎస్ విధి విధానాలను  ేకేసీఆర్  ప్రకటించే అవకాశం ఉంది.

ఈ నెల  18న  ఖమ్మంలో  నిర్వహించే సభకు సంబంధించిజనసమీకరణపై చర్చించారు.  ఈ సభకు ఢిల్లీ, పంజాబ్  , కేరళ ముఖ్యమంత్రులు  అరవింద్ కేజ్రీవాల్,  భగవంత్ సింగ్ మాన్,  పినరయి విజయన్ లను ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.  ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుండి  జన సమీకరణ విషయమై  పార్టీ నేతలకు  కేసీఆర్ దిశా నిర్ధేశం  చేశారు. 

also read:కారణమిదీ: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ భేటీ

ఈ నెల  18వ తేదీన  ఖమ్మంలో  కలెక్టరేట్  కార్యాలయ ప్రారంభోత్సవం చేయనున్నారు కేసీఆర్.  ఆ తర్వాత  బీఆర్ఎస్  సభలో  పాల్గొననున్నారు.  ఇదిలా ఉంటే  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పార్టీ మారుతారనే  ప్రచారం కూడా  లేకపోలేదు . ఈ నెల  18న   కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అవుతారని  ప్రచారం సాగుతుంది.  ఈ ప్రచారంపై  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం  స్పందించలేదు.   కాంగ్రెస్ పార్టీ వైపు నుండి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం అందినట్టుగా  చెబుతున్నారు.   ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల  నిర్వహణకు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల  1వ తేదీన  కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని  ఏర్పాటు  చేసిన  ఆత్మీయ సమ్మేళనంలో  తన అనుచరులంతా  పోటీ చేస్తారని ప్రకటించారు.  రానున్న రోజుల్లో  జరిగే  రాజకీయ కురుక్షేత్రానికి తాను సిద్దంగా  ఉన్నానని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  నిన్న ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios