Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ రద్దును మీకు చెప్పి చేస్తానా?: కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులుండవని టీఆర్ఎష్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ నుండి దశలవారీగా అభ్యర్ధులను ప్రకటించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు

KCR decides to conduct meeting on sept 2 at Hyderabad
Author
Hyderabad, First Published Aug 13, 2018, 7:43 PM IST

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులుండవని టీఆర్ఎష్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ నుండి దశలవారీగా అభ్యర్ధులను ప్రకటించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.

సోమవారం నాడు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్‌లో జరిగింది  ఈ సమావేశంలో  కేసీఆర్  వచ్చే ఎన్నికలపై  పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు  చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు గాను  సెప్టెంబర్ రెండో తేదీన  ప్రగతి సభ పేరుతో బారీ బహిరంగ సభను నిర్వహించాలని  టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది.

సెప్టెంబర్ నుండి దశలవారీగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్నట్టు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. పోటీ చేసే అభ్యర్ధులను ఎంపిక చేసే  బాధ్యతను  సీఎం కేసీఆర్‌కు అప్పగిస్తూ రాష్ట్ర అధ్యక్షుడికి అప్పగిస్తూ  రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది.  

ఇప్పటికే  పలు  రకాలుగా సర్వేలు నిర్వహించినట్టు చెప్పారు.  ఈ సర్వేల్లో  తమకు వందకు పైగా సీట్లు దక్కుతాయని ఈ సర్వే నివేదికలు  వచ్చిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లను కేటాయించనున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. 

అసెంబ్లీ రద్దు అనే విషయాన్ని మీకు చెప్పి చేస్తానా అని కేసీఆర్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. అసెంబ్లీని రద్దు చేసే విషయం మా వోళ్లకు కూడ తెలియదన్నారు. ఒకవేళ  అసెంబ్లీని రద్దు చేయాలనుకొంటే ఎవరికైనా చెబుతామా అని ఆయన ప్రశ్నించారు.

ఆరు మాసాలకు ముందు ఎన్నికలు వస్తే ముందస్తు ఉండదన్నారు.  ఇప్పుడు ముందస్తు ఎన్నికలు అనే  ప్రశ్నే ఉత్పన్నం కాదని కేసీఆర్ చెప్పారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీలతో ఫెడరల్ ఫ్రంట్  ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios