Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన చండీయాగం: ఇక మంత్రివర్గ విస్తరణపైనే కేసీఆర్

సహస్ర మహా చండీయాగం శుక్రవారం నాడు పూర్తైంది. సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌లో ఐదు రోజులుగా  చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ 8 మండపాల్లో  పూర్ణాహుతి జరిగింది.

kcr completes chandiyagam
Author
Hyderabad, First Published Jan 25, 2019, 5:07 PM IST

హైదరాబాద్: సహస్ర మహా చండీయాగం శుక్రవారం నాడు పూర్తైంది. సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌లో ఐదు రోజులుగా  చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ 8 మండపాల్లో  పూర్ణాహుతి జరిగింది.ఫిబ్రవరి 6వ తేదీన కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది.

విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు , కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానికి వెళ్లి పూర్ణాహుతి లో పాల్గొన్నారు . రాజశ్యామల మంటపం , బగలాముఖి మంటపం , నవగ్రహ, ఋగ్వేద , యజుర్వేద , సామవేద అధర్వణ వేద మంటపాలలో తొలుత పూర్ణాహుతి జరిగింది.

ఈ ఎనిమిది మండపాల్లో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ప్రధాన యాగశాల అయిన చండీమాత మహా మంటపంలో పూర్ణాహుతి ప్రారంభం అయింది . ఉదయం యధావిధిగా ముఖ్యమంత్రి దంపతులు మొదట రాజశ్యామలాదేవి మంటపంలో పూజలు నిర్వహించారు .

నమస్తత్వమే రాజశ్యామల మాతకీ జై అంటూ వేదపండితులు చేసిన మంత్రోచ్ఛరణం మధ్య పూజలు చేశారు . అక్కడ ఋత్వికులు నిర్వహిస్తున్న పూర్ణాహుతి లో పాల్గొన్నారు . 

బగలాముఖి దేవి మంటపంలో జరిగిన పూజల్లో వేదపండితులు జయ పీతాంబర ధారణి , దివ్య వేదోక్త మహా నీరాజనం సమర్పయామి అంటూ పూజలు చేశారు . నవగ్రహ మంటపంలో , మహారుద్ర మంటపంలో , చతుర్వేద మంటపాలలో కూడా పూర్ణాహుతి జరిగింది . సహస్ర శీర్షా , పురుష సంవేద పుష్పమాం , పుష్ప మాలికాం సమర్పయామి , సౌభాగ్య ద్రవ్య సమర్పయామి అంటూ పూర్ణాహుతి నిర్వహించారు  

ఇప్పటివరకు చేసిన పారాయణాలు, జపాలకు తద్దశాంశ హోమ తర్పణాలను నిర్వహించారు. ప్రధాన కలశం అధిష్ఠాన దేవత మంటపం వద్ద శారదా కల్పవృక్షం అనుసరించి అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించారు. 

అనంతరం చతుషష్టి యోగినీ బలి, మంగళ నీరాజన సేవ నిర్వహించారు. తదుపరి అగ్నిమథనం ద్వారా అగ్నిప్రతిష్ఠ చేసి పది కుండాల వద్ద ఇదే అగ్నితో హోమం ఆరంభించారు. పది యజ్ఞ కుండాలలో ఒక్కో యజ్ఞకుండం వద్ద ఆచార్య బ్రహ్మతో కలిపి పదకొండు మంది వేద పండితులు పాయసం, తెల్లనువ్వులు, నెయ్యితో కలిపిన  ద్రవ్యాన్ని ఆహుతులిస్తూ హోమాన్ని నిర్వహించారు.

 అనంతరం అష్టదిక్పాలక బలి, ప్రాయశ్చిత్త హోమాలను నిర్వహించారు. 700 సప్తశతి (చండీ) శ్లోకాల స్వాహాకారాలకు పాయసం, తెల్లనువ్వులు, నెయ్యితో కలిపిన ద్రవ్యాన్ని యజ్ఞభగవానుడికి హవిస్సుగా సమర్పించారు. మహాపూర్ణాహుతిలో భాగంగా చండీయాగ మంటపంలోని అన్ని యజ్ఞకుండాల అగ్నిని ప్రధాన యజ్ఞ కుండంలోకి తీసుకువచ్చి మహాపూర్ణాహుతిని ఆరంభించారు. 

యజ్ఞ ఆచార్యుడు మంగళ ద్రవ్యాలైన పసుపు, కుంకుమ, ఖర్జూర, వక్కలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జీడిపప్పు, పటికబెల్లం, బాదం, పచ్చకర్పూరం, గంధకచూరాలు, పూలు, పండ్లు, తమలపాకులు, పట్టుచీర, మారేడుకాయలు తదితరాలను పూర్ణాహుతిలో భాగంగా యజ్ఞభగవానుడికి సమర్పించారు. 

మహారుద్ర, రాజశ్యామల, బగళాముఖి, చతుర్వేద, నవగ్రహ యాగ మంటపాల్లో కూడా షోడశోపచార పూజలు చేసి, హోమాల అనంతరం పూర్ణాహుతిని నిర్వహించారు. సువాసిని పూజ, మహదాశీర్వచనం, ఋత్విక్‌ సన్మానం నిర్వహించారు.

కలియుగంలో త్వరగా ఫలితాన్ని ఇచ్చేది చండీ దేవత . ఆమెను ఉపాసించి ఎంతోమంది సత్ఫలితాలను పొందారు . అమ్మవారితోనే ఈ సప్తశతిలో ఒక మాటను అన్నది . ఎక్కడైతే ఈ సప్తశతి పటించబడుతుందో అక్కడ నేనుంటాను . కేవలం ఉండటమే కాకుండగా సదామత ద్విమోక్షామి ఎప్పుడూ ఆ ప్రాంతాన్ని విడిచి ఉండను అన్నది .ఆమె ఎక్కడ ఉంటే అది మణి ద్వీపము , సుభిక్షం , సస్యశ్యామలమై ఉంటుందని చెబుతుంటారు.

కేసీఆర్ దంపతులు చండీ సంబంధమైన అన్ని రకాల ఉపాసనలు చేశారు . దేశ క్షేమం, లోక సంరక్షణమే ప్రధాన ద్యేయంగా సంకల్పించి రాజశ్యామల , బగలాముఖి , నవగ్రహ , చతుర్వేద , మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగాన్ని చేయతల పెట్టి శృంగేరీ జగద్గురులు శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి , విధుశేఖర భారతీ మహా స్వాములవారి ఆశీస్సులను అందుకొన్నారు.

 గత నాలుగు రోజుల నుండి గణపతి సహస్ర మోదక హోమము , రాజశ్యామలా మహా మంత్రానుష్టానము , లక్ష బగలాముఖీ మహా మంత్రానుష్టానము , వెయ్యి చండీ పారాయణములు , మహారుద్ర మంత్రముల అనుష్టానములను చేసి , దశాంశ  హోమ పక్షమును ఆశ్రయించారు.

ఇవాళ ఉదయం 11 గంటల నుండి మహాద్భుతంగా అన్ని యాగాల పూర్ణాహుతులు చేసి సహస్ర చండీ మహా యాగ పూర్ణాహుతి ని అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు నిర్వహించారు . ఇందులో విశాఖ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యక్షంగా పాల్గొని అనుగ్రహించారు . కార్యక్రమానంతరం సీఎం కేసీఆర్ ఋత్వికులను ఘనంగా సన్మానించారు .

ముఖ్యమంత్రిగా కసీఆర్ ప్రమాణం చేశారు. తనతో పాటు హోం మంత్రిగా మహమూద్‌ అలీ ప్రమాణం స్వీకారం చేశారు. మరో 16 మందికి కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే కేసీఆర్‌ ఇష్టమైన సంఖ్య 6. చండీయాగం పూర్తైనందున  ఫిబ్రవరి ఆరో తేదీన మంత్రివర్గాన్ని  విస్తరించే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది.

 

"


 

Follow Us:
Download App:
  • android
  • ios