షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు
రాష్ట్రంలో టిఆర్ ఎస్ ముందస్తు ఎన్నికల వెళుతుందని వినబడుతున్న వూహాగానాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ తెరవేశారు.
ఈ రోజు శాసన మండలిలో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అలోచన లేదని స్పష్టం చేశారు.
‘ప్రజలంతా మాతోనే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగుతాయి,’ అనిఆయన అన్నారు.
శాసన మండలిలో గవర్నర్ కు ధన్యావాదాలు తెలిపే తీర్మానం మీద ఆయన ప్రసంగించారు.
ఈ మధ్య వివిధ వర్గాలకు ముఖ్యంగా ముస్లింలకు, వెనకబడినవర్గాలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటిస్తున్నవరాలను చూసి అన్ని రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్లు అనుమానిస్తున్నాయిన.తెలంగాణా బడ్జెట్ ప్రతిపాదనల అనంతరం నిన్న తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొక మారు ఈ అనుమానం వ్యక్తం చేశారు.2018 లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంటూ ముందస్తు ఎన్నికలు ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఈ చర్చ వూపందుకుంటూ ఉండటంతో ఈ రోజు కెసిఆర్ వివరణ ఇచ్చారు.
ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
ఎవరూ అందోళన చెందవలసిన పని లేదని కూడా సలహా ఇచ్చారు.
