తాము మూడింట రెండింట మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తామని  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పారు. 


సిద్దిపేట: తాము మూడింట రెండింట మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తామని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పారు.

సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శుక్రవారం నాడు తన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

ఓటు హక్కును వినియోగించుకొన్న తర్వాత కేసీఆర్ మీడియాతో టీఆర్ఎస్ కు అనుకూల పవనాలు ఉన్నాయని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. తాము ముందు నుండి చెబుతున్నట్టుగానే ప్రజలంతా తమకు అనుకూలంగానే ఉన్నారని కేసీఆర్ చెప్పారు.

తాము తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. ప్రజలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. తమ పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు. 

పోలింగ్ శాతం కూడ ఈ దఫా పెరిగే అవకాశం ఉందన్నారు. హైద్రాబాద్‌లో కూడ భారీగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి... మీరే చూస్తారని కాదన్నారు.