Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కొందరు తెలివిలేని గొర్రెలు

  • అధికారం ఏ వర్గం చేతిలో కేంద్రీకృతం కారాదు
  • అన్ని వర్గాలు శాసించే స్థాయికి చేరాలి
  • గొర్రెలు పంచుడు అభివృద్ధి కాదా?
  • రెండు చట్టసభలకు బిసిలే అధినాయకులుగా ఉన్నారు
KCR  calls sheep project critics as black sheep

తెలంగాణలో కొందరు తెలివిలేని గొర్రెలు ఉన్నారు.. వాళ్లకు మీరే బుద్ధి చెప్పాలి అని సిఎం కేసిఆర్ ఘాటుగా చురకలు వేశారు. తాను గొర్రెలు పంచుతుంటే గొర్రెలు పంచుడే అభివృద్ధా అని కొన్ని పార్టీల వారు మాట్లాడారని అన్నారు. ఆ పార్టీ నేతల పేర్లు చెప్పబోనంటూనే వారికి మీరే బుద్ధి చెప్పాలన్నారు. ఇదంతా యాదవ, కుర్మ భవనాల శంకుస్థాపన సభలో సిఎం కేసిఆర్ హాట్ హాట్ గా మాట్లాడారు. కేసిఆర్ మాట్లాడిన ప్రసంగంలోని మరిన్ని ముఖ్యంశాలు కింద చదవండి.

గొర్రెలు పంచుడు అభివృద్ధి కాదా ? గొర్రెలు పంచడం అభివృద్ధో కాదో.. మీరే చెప్పాలి. ఆ తెలివి లేని గొర్రెలకు చెప్పాలి. బిసిలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి రాజకీయ అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది. అందుకే రెండు చట్టసభలకు అధినేతలుగా బిసిలను నియమించాము. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఇద్దరూ బిసి వర్గానికి చెందిన వారే. బంగారు తెలంగాణకు బాటలు మొదలు పెట్టినం. 48 లక్షల గొర్రెల పంపిణే దీనికి సంకేతం. కుర్మ సంఘం నేత యజ్ఞ మల్లేషం కు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా గెలిపిస్తా. ఒక యాదవ సోదరునికి మార్చిలో రాజ్యసభకు అవకాశం కల్పిస్తాం. బిసిల్లో పేదలను ఏ కుల సంఘం వారు ఆ కులంలోని పేదలకు సాయం చేయాలి. అధికారం ఏ వర్గం చేతిలో కేంద్రీకృతం కాకూడదు. అధి సరైన సిద్ధాంతం కాదు. అన్ని వర్గాలకు అధికారం రావాలి. అన్ని వర్గాలకు శాసించే అధికారం రావాలి.

ఏదైనా అనుకుంటే రాత్రికి రాత్రే అయిపోదు. గొల్ల, కుర్మ సంఘం భవనాలు వెంటనే నిర్మాణం జరగాలి.

గండిపేట సోయగమంతా కనబడేలా విద్యార్థుల హాస్టళ్లు, మహిళకు శిక్షణా కేంద్రాలు వెంటనే పూర్తి చేయాలి. నాలుగైదు అంతస్థుల్లో భవనాలు నిర్మాణం కావాలి. ఇండియాలో నెంబర్ 1 గొల్ల కుర్మలు ఎక్కడున్నరంటే తెలంగాణలోనే ఉన్నరని చెప్పేలా మీరు నిలబడాలి. రజక సోదరులకు ధోబీ ఘాట్లు నిర్మిస్తున్నాం. చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీ మీద రంగులు, రసాయనాలు, నూలు అందిస్తున్నాం. నాయీ బ్రాహ్మణులకు ఆధునిక క్షౌరశాలలు ఏర్పాటు చేస్తున్నాం.

Follow Us:
Download App:
  • android
  • ios