Asianet News TeluguAsianet News Telugu

తుపాకులగూడెం బ్యారేజీకి సమ్మక్క పేరు: కేసీఆర్

తుపాకులగూడెం డ్యారేజీకి సమ్మక్క పేరును పెడుతున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. బుధవారం నాడు ఈ మేరకు సీఎం కేసీఆర్ రిజర్వాయర్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.

KCR announces sammakka name to tupakulagudem barrage
Author
Hyderabad, First Published Feb 12, 2020, 6:52 PM IST


హైదరాబాద్: గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదీవాసీ వీరవనిత, వనదేవత.. ‘‘సమ్మక్క’’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు తుపాకులగూడెం బ్యారేజీకి ‘‘సమ్మక్క బ్యారేజీ’’ గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని ఈఎన్‌సీ మురళీధర్ రావు ను సిఎం ఆదేశించారు.

 ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా వుండడం చేతనే తెలంగాణలో అభివృద్ది అనుకున్న రీతిలో సాగుతున్నదని సిఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తై తెలంగాణ పొలాల్లోకి కాళేశ్వరం సాగు నీరు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సిఎం గుర్తు చేశారు.

 గురువారం నాడు ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించనున్నారు. నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటుంది.. ఇప్పుడు మనం కట్టుకున్న బ్యారేజీలు నిండుకుండలా మారాయన్నారు.

రానున్న వానా కాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుందని చెప్పారు.ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసుకునే దిశగా అటునుంచి కాలువలకు మల్లించే దిశగా ఇరిగేషన్ శాఖ ఇప్పటినుంచే అప్రమత్తం కావాలని సీఎం  ఆదేశించారు. ఈ మేరకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ మేరకు పనుల విభజన చేసుకోవాలని సీఎం ఆదేశించారు. 

ఈ సమీక్షాసమావేశంలో మంత్రులు గుంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, రైతుసమన్వయ సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, సిఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, సాగునీటి శాఖ ఇఎన్ సీ మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios