Asianet News TeluguAsianet News Telugu

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ. 10 వేలు: కేసీఆర్

నగరంలోని వరద నీటి ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఈ నెల 20వ తేదీ నుండి ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని ఆయన  హామీ ఇచ్చారు.

KCR announces Rs 10 thousand financial assistance for flood victims in hyderabad
Author
Hyderabad, First Published Oct 19, 2020, 3:59 PM IST

హైదరాబాద్: నగరంలోని వరద నీటి ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఈ నెల 20వ తేదీ నుండి ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని ఆయన  హామీ ఇచ్చారు.

వర్షాలు, వరదలతో ఇల్లు పూర్తిగా కూలిపోయినవారికి లక్ష రూపాయాల చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని ఆయన తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లోని పేదల్లో ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు బాధితులకు పరిహారం అందించాలని ఆయన ఆదేశించారు. 

హైద్రాబాద్ నగరంలో 200 నుండి 250 బృందాలను ఏర్పాటు చేసి అన్ని చోట్ల ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని పుర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమరా్ ను సీఎం ఆదేశించారు.దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌళిక వసతులను యుద్దప్రాతిపదికన చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆర్ధిక సహాయం అందించేందుకు గాను మున్సిఫల్ శాఖకు రూ. 550 కోట్లను తక్షణమే విడుదల చేస్తున్నట్టుగా సీఎం తెలిపారు.

పేదలకు సహాయం అందించడమే అతి ముఖ్యమైన బాద్యతగా స్వీకరించి హైద్రాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పనిచేయాలని ఆయన సూచించారు.నష్టపోయిన ప్రజలు ఎందరున్నా కూడ వారిని ఆదుకొంటామని ఆయన చెప్పారు. లక్షల మంది బాధితులున్నా సరే వారిని ఆదుకొంటామని ఆయన చెప్పారు. 

బాధిత కుటుంబాల వివరాలను అధికారులకు చెప్పి సహాయం పొందాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొని బాధితులకు అండగా ఉండాలని ఆయన  కోరారు.

మున్సిపల్ శాఖకు రూ. 550 కోట్లు విడుదల

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైద్రాబాద్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం అందించేందుకు ఆర్ధికశాఖ  రూ. 550 కోట్లను మున్సిపల్ శాఖకు సోమవారం నాడు విడుదల చేసింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios