హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం నాడు రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో  ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొన్నాయి.

గవర్నర్ నరసింహాన్  రాజ్‌భవన్ లో ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.మరోవైపు ఏపీ రాష్ట్రం తరపున ఆ రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. 

ఎట్ హోం కార్యక్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, కేటీఆర్, కేసీఆర్ లు చాలా సేపు మాట్లాడుకొన్నారు. కేటీఆర్ వెళ్లిపోయిన తర్వాత కేసీఆర్, పవన్ కళ్యాణ్ లు పక్క పక్కనే కూర్చొని చర్చించుకొన్నారు. ఏపీ రాజకీయాలపై పవన్ కళ్యాణ్‌తో కేసీఆర్ తో చర్చించినట్టు సమాచారం. కేటీఆర్, జగన్ సమావేశం గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. 

ఇటీవల జగన్‌తో కేటీఆర్‌ భేటీ, జగన్ గృహప్రవేశానికి హాజరయ్యేందుకు వచ్చే నెలలో కేసీఆర్‌ అమరావతి పర్యటన తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్‌తో భేటీ అంశాలను పవన్‌తో కేటీఆర్‌ చర్చించినట్లు సమాచారం. ఏపీ రాజకీయలపై ఇరువురు చర్చించుకున్నట్లు వినికిడి.

తొలుత అతిథులను గవర్నర్ దంపతులు పేరు పేరున పలకరించారు. సీఎం కేసీఆర్ కూడ అతిథులతో మాట్లాడారు. ఎట్ హోంలో పాల్గొన్న మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సీఎం కేసీఆర్‌ను తన వద్దకు లాక్కొని మరీ ఆప్యాయంగా కౌగిలించుకొన్నారు.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు. తెలంగాణకు చెందిన అన్ని పార్టీలకు చెందిన నేతలతో కేసీఆర్ కరచాలనం చేశారు.సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క తెలంగాణ  రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో ముచ్చటిస్తూ కన్పించారు.

ఎట్ హోం కార్యక్రమం నుండి వెళ్లిపోయే ముందు గవర్నర్ నరసింహాన్ పవన్ తో కొద్దిసేపు మాట్లాడారు. కేటీఆర్ కు కరచాలనం చేసి ఆయనను కౌగిలించుకొని వెళ్లిపోయాడు. చివరగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పవన్ ను పలకరించారు. జానారెడ్డితో మాట్లాడిన పవన్ అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి