బీజేపీకి ఆ పార్టీ నేత కాట్రగడ్డ ప్రసూన గుడ్‌బై చెప్పారు.  త్వరలోనే ఆమె టీడీపీ లో చేరే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  

హైదరాబాద్: బీజేపీకి ఆ పార్టీ నేత కాట్రగడ్డ ప్రసూన గుడ్‌బై చెప్పారు. త్వరలోనే ఆమె టీడీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సెటిలర్ల ఓట్లను భారీగా తొలగించారని ఆరోపిస్తూ కాట్రగడ్డ ప్రసూన ఇటీవల ఆందోళన కూడ నిర్వహించారు. బీజేపీకి కాట్రగడ్డ ప్రసూన రాజీనామా చేయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకొంది.

త్వరలోనే ఆమె టీడీపీలో చేరేందుకు బీజేపీకి గుడ్‌బై చెప్పారనే ప్రచారం మాత్రం సాగుతోంది. అయితే ఈ విషయమై మాత్రం టీడీపీ వర్గాల నుండి కానీ, ప్రసూన నుండి కానీ స్పష్టత రాలేదు.

కాట్రగడ్డ ప్రసూన టీడీపీలో చేరితే ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయమై రెండు మూడు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.