కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి: అనర్హత వేటేయాలని బీఆర్ఎస్ ప్లాన్

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నెల 1వ తేదీన కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

kasireddy narayna Reddy joins in  Congress lns

న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ  కసిరెడ్డి నారాయణ రెడ్డి శుక్రవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.   ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో  కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  ఈ నెల 1వ తేదీన బీఆర్ఎస్ కు కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి  కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది.

 

కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి  కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే  జైపాల్ యాదవ్ కే  కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు.   దీంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు.కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ లో చేరక ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో  బీఆర్ఎస్ లో చేరారు.  కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి ఆయన గతంలో  ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన గణనీయమైన ఓట్లను దక్కించుకన్నారు.

కసిరెడ్డిపై అనర్హత వేటుకు బీఆర్ఎస్ ప్లాన్

పార్టీ మారిన కసిరెడ్డి నారాయణ రెడ్డిపై  అనర్హత వేటేసేందుకు  బీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. కసిరెడ్డి నారాయణ రెడ్డిపై అనర్హత వేటేయాలని  శాసనమండలి చైర్మెన్ కు ఫిర్యాదు చేయనున్నారు.  గతంలో  బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన  రాములు నాయక్ పై  అనర్హత వేటేయాలని ఫిర్యాదు చేసింది. కసిరెడ్డి నారాయణ రెడ్డిపై కూడ అనర్హత వేటేయాలని బీఆర్ఎస్  ఫిర్యాదు చేయనుంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios