తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబు నాయుడుకు కాసాని జ్ఞానేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణలోని టీటీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అంతకుముందు ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన కాసాని జ్ఞానేశ్వర్.. అనంతరం గన్‌పార్క్ వరకు ర్యాలీగా వెళ్లారు. గన్ పార్క్ దగ్గర అమర వీరుల స్థూపానికి కాకాని నివాళులు అర్పించారు. తర్వాత భారీ ర్యాలీగా ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నారు. 

ఇక, కాసాని జ్ఞానేశ్వర్ గత నెలలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలోకి చేరిన కొద్ది రోజులకే ఆయనకు టీటీడీపీ అధ్యక్షుడిని చంద్రబాబు నియమించారు. ఇప్పటి వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులుకు పార్టీ పొలిట్‌బ్యూరోలో అవకాశం కల్పించారు. 

ఇక, కాసాని జ్ఞానేశ్వర్ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనగతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గానూ పనిచేశారు.