Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుంది.. 87 స్థానాల్లో అభ్యర్థులు సిద్దం: కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ అంశంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ ఇచ్చారు.

kasani gnaneshwar says TDP Will Contest In Telangana Assembly Elections 2023 ksm
Author
First Published Oct 16, 2023, 2:04 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ అంశంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని తెలిపారు. రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ములాఖత్‌లో తాను కలిశానని.. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను ఆయన వివరించానని చెప్పారు. చంద్రబాబు నాయుడు మంగళవారం జైలు నుంచి బయటకు వస్తాడని తాము ఆశిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా ఆందోళన ఉందని అన్నారు.

తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదనే తప్పుడు ప్రచారం జరుగుతుందని.. దానిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తోందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 87 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సిద్దం చేశామని.. చంద్రబాబు ఆమోదించాక పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణలోని అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో ఉంటుందని అన్నారు. తెలంగాణలో టీడీపీ తరఫున నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తారని చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios