ఉత్తమ్‌వి గాలిమాటలు.. రేవంత్‌‌కు డబ్బులు పంచడమే వచ్చు :కర్నె

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 27, Aug 2018, 3:17 PM IST
karne prabhakar comments on revanth reddy
Highlights

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, టీడీపీలు పాడిందే పాడరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని... ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండేళ్ల నుంచి చెప్పిందే చెబుతున్నారని ఆరోపించారు.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, టీడీపీలు పాడిందే పాడరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని... ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండేళ్ల నుంచి చెప్పిందే చెబుతున్నారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదని కర్నె ప్రశ్నించారు.

మేము కోటి ఎకరాలకు నీళ్లు ఇద్దామని.... కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన టీడీపీలు కాళేశ్వరానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని తెలిపారు. 150 మీటర్ల దగ్గర కడితే ఏమవుతుంది.. 140 కిలోమీటర్ల దగ్గర కడితే ఏమవుతుందనే దానిపై ఉత్తమ్‌కు ఏం తెలియదని.. గాలి మాటలు మాట్లాడటం తప్పించి ఆయనకు తెలిసింది ఏం లేదని దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డికి బుద్ది లేదని... డబ్బులు పంచడం అలవాటని... మా ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇచ్చింది నిజం కాదా అని ప్రభాకర్ ప్రశ్నించారు. రేవంత్‌ది.. ఆయన పార్టీది దొంగబుద్దని.. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని.. కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలను ప్రజలే తిప్పి కొడతారని.. తగిన బుద్ది చెబుతారని.... ఇప్పటికైనా పిచ్చి మాటలు మాట్లాడటం మానేయాలని ప్రభాకర్ హితవు పలికారు. ప్రగతి నివేదన సభకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలిరావడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 
 

loader