తెలంగాణ అసెంబ్లీ ప్రాగణంలో ఇవాళ ఓ అరుదైన దృశ్యం ఆవిషృతమైంది. హైదరాబాద్ లోని అసెంబ్లీని సందర్శించడానికి వచ్చిన కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్. రమేష్ కుమార్ కు ఘన స్వాగతం లభించింది.  ఇలా అతిథిగా విచ్చేసిన శాసనసభాపతికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తో పాటు అధికారులు సాదరంగా గౌరవించారు. ఆయనను శాలువా, పూల బొకేతో సత్కరించారు. 

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి వి నరసింహా చార్యులు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ వారితో శాసనసభల పనితీరు, చట్టసభలలో సభ్యుల నియమావళి వంటి అంశాలపై చర్చించారు.