Asianet News TeluguAsianet News Telugu

వివాహిత ఆత్మహత్యాయత్నం: కాపాడిన కరీంనగర్ పోలీసులు

అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళను రక్షించారు  

karimngar police rescued woman from suicide
Author
Karimnagar, First Published Aug 30, 2020, 5:11 PM IST

కరీంనగర్: అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళను రక్షించారు  కరీంనగర్ పోలీసులు. భర్త,అత్తల అదనపు కట్నం కోసం నిత్యం వేధింపులు, చిత్రహింసలకు గురిచేస్తుండటంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వివాహిత (25) తన 9 నెలల పసి బిడ్డ తో కలిసి ఎల్ఎండి రిజర్వాయర్ నీటి లో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు ఆమెను రక్షించారు.  లేక్ అవుట్ పోస్ట్ పోలీసులు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది.

జీవనోపాధి కోసం కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో నివాసం ఉంటున్న వివాహిత మారుపాక స్వప్న (25) ను భర్త రాజు అదనపు కట్నం కోసం తరచూ మానసికంగా వేధిస్తూ, శారీరకంగా హింసిస్తున్నాడు.

కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆమె భర్త ఆదివారం ఉదయం కూడా ఆమెను శారీరకంగా హింసించాడు. దీంతో ఆమె తన 9నెలల పసిబిడ్డతో సహా ఎల్ యండి రిజర్వాయర్ సమీపంలోకి వచ్చి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

ఈ విషయాన్ని అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మహేశ్వర్, హోం గార్డ్ అన్వర్ అడ్డుకున్నారు.వెంటనే ఎస్ఐ శ్రీనాథ్ కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కౌన్సెలింగ్ నిర్వహించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios