Asianet News TeluguAsianet News Telugu

Bandi Sanjayపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు.. కరీంనగర్‌లో టెన్షన్

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు (GO 317) నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay).. కరీంనగర్‌లోని (Karimnagar) తన ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు ఆదివారం రాత్రి భగ్నం చేశారు. ఈ క్రమంలోనే కరీంనగర్ పోలీసులు.. బండి సంజయ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. 

Karimnagar Police register two cases on bandi sanjay tension prevails
Author
Karimnagar, First Published Jan 3, 2022, 9:26 AM IST

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు (GO 317) నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay).. కరీంనగర్‌లోని (Karimnagar) తన ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు ఆదివారం రాత్రి భగ్నం చేశారు. అనంతరం ఆయనను మానుకొండూరు పోలీసు స్టేషన్‌కు తరిలించారు. అయితే ఈ ఉదయం కరీంనగర్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు(పీటీసీ) బండి సంజయ్‌ను తీసుకొచ్చారు. అయితే ఈ క్రమంలోనే కరీంనగర్ పోలీసులు.. బండి సంజయ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల (Covid norms) ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలగించడంపై  బండి సంజయ్ మీద కేసులు నమోదు చేశారు. ఆయనతో పాటు మరికొందరు బీజేపీ నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు ఈరోజు బండి సంజయ్‌ను కోర్టు ముందు హాజరు పరిచేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపు బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పీటీసీ గ్రౌండ్ వద్దకు అంబులెన్స్‌ చేరుకుంది. వైద్య పరీక్షలు పూర్తయ్యాక మధ్యాహ్నం తర్వాత బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని తెలుస్తోంది. 

Also Read: బండి సంజయ్ ను కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించిన పోలీసులు

ఇక, ఈరోజు ఉదయం బండి సంజయ్‌ను పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తీసుకొచ్చారనే సమాచారంతో.. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ తెలంగాణ నాయకులు.. నేడు జిల్లా, మండల కేంద్రాల్లో బీజేపీ దీక్షలు చేపట్టనున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ బీజేపీ నిర్ణయం తీసుకుంది. 

అసలేం జరిగిందంటే..
తెలంగాణ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో నెంబ‌ర్ 357ను వ్య‌తిరేకిస్తూ బండి సంజయ్ ఆదివారం రాత్రి జాగ‌ర‌ణ దీక్ష చేప‌ట్టాల‌నుకున్నారు. ఈ దీక్ష‌ను క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని తన ఎంపీ ఆఫీసు ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన వేదిక‌పై ఆదివారం రాత్రంతా జాగ‌ర‌ణ చేప‌ట్టాల‌ని బీజేపీ శ్రేణులు భావించారు. అయితే దీనిని భ‌గ్నం చేయ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నించారు. ఈ స‌మ‌యంలో కొంత గొడ‌వ చోటు చేసుకుంది. తోపులాట జ‌రిగింది. ఇలా గంద‌రగగోళం నెల‌కొన్న స‌మ‌యంలో బండి సంజ‌య్ త‌న ఆఫీసులోకి చేర‌కున్నారు. ఆఫీసులోనే దీక్ష చేయ‌డం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని త‌లుపులు తెరిచేందుకు ప్రయత్నించిన ఓపెన్ కాలేదు. దీంతో పోలీసులు బ‌ల‌వంతంగా గ్యాస్ వెల్డ‌ర్ల సాయంతో త‌లుపులు తెరిచారు.

అనంత‌రం ఆయన దీక్ష భ‌గ్నం చేసి పోలీసుల వాహ‌నాల్లో మానకొండూరు స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. రాత్రి మొత్తం సంజయ్‌ను అక్కడే ఉంచారు. అనంతరం బండి సంజ‌య్‌ను సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీటీసీ సెంటర్‌కు తరలించారు. ఇందుకోసం ఐజీ నాగిరెడ్డి వాహనం ఉపయోగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios