Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ తో కుమారస్వామి, తిరుమలవలన్ భేటీ: జాతీయ రాజకీయాలపై చర్చ

ప్రగతి భవన్ లో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తెలంగాన సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. తమిళనాడు కు చెందిన వీసీకే పార్టీ చీఫ్ తిరుమలవలన్  కూడా కేసీఆర్ తో సమావేశమయ్యారు. 
 

Karanataka Former CM Kumaraswamy Meets KCR at  Pragathi Bhavan in Hyderabad
Author
First Published Oct 5, 2022, 10:20 AM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు వీసీకే  పార్టీ చీఫ్ తిరుమలవలన్ భేటీ బుధవారం నాడు భేటీ అయ్యారు.ఇవాళ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశానికి   కుమారస్వామి, తిరుమలవలన్ హాజరు కానున్నారు.  ఈ సమావేశంలో పాల్గొనేందుకు గాను కుమారస్వామి నిన్న రాత్రే హైద్రాబాద్ కు చేరకుున్నారు. కుమారస్వామితో పాటు ఆయన సోదరుడుమాజీ మంత్రి రేవణ్ణ పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలు కూడ కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీసీకే చీఫ్ తిరుమలవలన్ తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ తో సమావేశంలో పాల్గొన్నారు.కుమారస్వామి, తిరుమలవలన్ తో కలిసి సీఎం కేసీఆర్ టిఫిన్ చేశారు.ప్రగతి భవన్  నుండి  సీఎం కేసీఆర్ తో పాటు కుమారస్వామి, తిరుమలవలన్ కూడా తెలంగాణ భవన్ కు చేరుకుంటారు.

జాతీయ రాజకీయాల్లోకి  ఏ రకమైన పాత్ర  పోషించాలనే విషయమై కేసీఆర్  చర్చిస్తున్నారు. దేశంలో ఉన్న రాజకీ పరిస్థితులు, బీజేపీని గద్దెదించేందుకు అవలంభించాల్సిన విధానాలపై కేసీఆర్ తో  నేతలు చర్చిస్తున్నారని పార్టీ వర్గాలు  చెబుతున్నాయి.

2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. 2018 నుండి దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలనేతలను కేసీఆర్  కలుస్తున్నారు. టీఎంసీ, జేడీఎస్, జేడీయూ, సమాజ్ వాదీ , డీఎంకె, శివసేనలతో కేసీఆర్ భేటీ అయ్యారు. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపైచర్చించారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లోని  ఉన్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ అధ్యయనం చేశారు.ఆయా  రాష్ట్రాల్లో  ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవలంభించాల్సిన వ్యూహలను సిద్దం చేశారు. జాతీయపార్టీని ప్రకటించే సమయంలో తమ పార్టీ ఎజెండాను కేసీఆర్ ప్రకటించనున్నారు. ప్రధానంగా రైతు ఎజెండాను తమ పార్టీ ఎజెండాలో ప్రస్తావించే అవకాశం ఉంది. 

also read:జాతీయ పార్టీపై నేడే కేసీఆర్ కీలక ప్రకటన: ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టనున్న మధుసూధనాచారి

ఇటీవలనే తెలంగాణ సీఎం కేసీఆర్ తో కుమారస్వామి భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై కుమారస్వామితో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ సమావేశంలో కుమారస్వామితో చర్చించారు. జాతీయపార్టీ ఏర్పాటును స్వాగతిస్తామని కుమారస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios