కేసీఆర్‌కు షాక్: కామారెడ్డి నుండి పోటీకి మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల నిర్ణయం

కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని  కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పరిధిలోని గ్రామాల రైతులు నిర్ణయం తీసుకున్నారు.  కనీసం 100 నామినేషన్ల దాఖలు చేయనున్నారు.

Kamareddy Master Plan Village Farmers Decided to contest  From Kamareddy Assembly segment lns

కామారెడ్డి:  కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేయాలని  కామారెడ్డి  మాస్టర్ ప్లాన్  పరిధిలో గల రైతులు  నిర్ణయం తీసుకున్నారు.కామారెడ్డి మాస్టర్ ప్లాన్  పరిధిలోని తొమ్మిది గ్రామాలకు చెందిన రైతులు  మంగళవారంనాడు  లింగాపూర్ గ్రామంలో సమావేశమయ్యారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసినట్టుగా  గవర్నర్ తో చెప్పించాలని రైతులు డిమాండ్ చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పరిధిలోని  9 గ్రామాలకు చెందిన రైతులు కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామం నుండి 15 నామినేషన్లు దాఖలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కనీసం వంద నామినేషన్లు దాఖలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని  ఈ ఏడాది జనవరి మాసంలో  మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు.  కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను  నిరసిస్తూ  పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు నిర్వహించిన నేపథ్యంలో  అప్పట్లో  కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  భవిష్యత్తులో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. అయితే  మాస్టర్ ప్లాన్ పేరుతో తమ భూములను ప్రభుత్వం తీసుకోవడంపై రైతులు ఆందోళనకు దిగారు.

also read:తెరపైకి మరోసారి కామారెడ్డి మాస్టర్ ప్లాన్: నామినేషన్లు దాఖలుపై నేడు కీలక భేటీ

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  ఆందోళనలు నిర్వహించిన సమయంలో  విపక్ష పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు.కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి ఈ దఫా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.  దీంతో తమ డిమాండ్ పై సీఎం నుండి హామీ పొందేందుకు వీలుగా  మాస్టర్ ప్లాన్ పరిధిలోని రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  మాజీ మంత్రి షబ్బీర్ అలీ బరిలో దిగుతున్నారు.  బీజేపీ అభ్యర్థిగా వెంకటరమణరెడ్డి పోటీ చేస్తున్నారు.   2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో  నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పసుపు రైతులు  పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు.  తమ డిమాండ్ ను దేశ వ్యాప్తంగా తెలియజెప్పే ఉద్దేశ్యంతో  పసుపు రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios