కల్వకుంట్ల కుటుంబం తర్వాత ఆ కుటుంబానికే ఎక్కువ సీట్లు...

First Published 6, Sep 2018, 8:08 PM IST
kalvakuntla and patnam families taken more mla seats
Highlights

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరలేపారు. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. అసెంబ్లీని రద్దు చేయడమై కేసీఆర్ చేసిన సాహసమనుకుంటే అదే రోజు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించి మరో సాహసం చేశారు. దీన్ని  సాహసం అనేకంటే తన నిర్ణయం పై వున్న నమ్మకమని చెప్పాలి. అయితే కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఒకే కుటుంబానికి చెందినవారు కొందరికి టికెట్లు దక్కాయి. ఇలా ఏయే కుటుంబాలకు టికెట్లు లభించాయో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.

టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసే అభ్యర్థుల జాబితాలో కల్వకుంట్ల ఫ్యామిలీ నుండి ఇద్దరికి చోటు దక్కింది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండగా, కేటీఆర్ సిరిసిల్ల అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీష్ రావు కూడా సిద్దిపేట నుండి పోటీ చేయనున్నారు.ఇతడితో కలుపుకుంటే మొత్తం ముగ్గురు అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. 

ఇక కల్వకుంట కుటుంబంతో పోటీ పడుతూ టికెట్లు సాధించింది పట్నం కుటుంబం. తాండూర్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి మరోసారి బరిలోకిదిగనుండగా ఆయన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుండి రేవంత్ తో పోటీకి దిగనున్నాడు. ఇలా కేసీఆర్ కుటుంబం తర్వాత ఒకే ప్యామిలీకి ఎక్కువ సీట్లు దక్కించుకున్న ఘనత పట్నం కుటుంబానికే దక్కింది.  
 
loader