Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ అనూహ్య నిర్ణయం.. నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కవిత, రేపు నామినేషన్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) కుమార్తె , కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) మరోసారి అవకాశం దక్కించుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో (nizamabad local body quota) ఆమెను ఎంపిక చేస్తూ టీఆర్ఎస్ (trs) అధినేత నిర్ణయించారు. 

kalvakunta kavitha gets mlc chance again from nizamabad local body quota
Author
Hyderabad, First Published Nov 22, 2021, 7:27 PM IST

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) కుమార్తె , కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) మరోసారి అవకాశం దక్కించుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో (nizamabad local body quota) ఆమెను ఎంపిక చేస్తూ టీఆర్ఎస్ (trs) అధినేత నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల కోటాలోనే ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలోనే కవిత పదవి కాలం ముగియనుండటంతో గులాబీ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (bjp) అభ్యర్థి ధర్మపురి అరవింద్ (dharmapuri arvind) చేతిలో కవిత ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉన్నారు. అయితే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి (bhupathi reddy) కాంగ్రెస్‌లోకి (congress) వెళ్లడంతో ఆయనపై అనర్హత వేటుపడింది. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్కడి నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనుంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి కవితకు అవకాశం కల్పించారు కేసీఆర్. 

ALso Read:కేసీఆర్ సంచలన నిర్ణయం: ఏడుగురు సిట్టింగ్‌లకు ఉద్వాసన, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే..?

మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు…. ఎమ్మెల్సీగా ఎన్నికైన‌ట్లు రిట‌ర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణపత్రం తీసుకున్నారు. క‌డియం శ్రీహరి, గుత్తా, బండ ప్రకాష్‌, ర‌వీంద‌ర్‌, వెంక‌ట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి స‌ర్టిఫికెట్ తీసుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ…. ఆరు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవమయ్యాయని.. తమకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని కడియం శ్రీహరి అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios