Asianet News TeluguAsianet News Telugu

మేనేజ్‌మెంట్ కోటాలో మెరిట్ స్టూడెంట్స్ ధరఖాస్తు: కాళోజీ యూనివర్శిటీ రిజిష్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు

మెరిట్ స్టూడెంట్స్ మేనేజ్ మెంట్ కోటాలో ఆడ్మిషన్స్ కోసం ధరఖాస్తు చేయడంపై అనుమానంతో కాళోజీ యూనివర్శిటీ రిజిష్ట్రార్ ప్రవీణ్  పోలీసులకు పిర్యాదు చేశారు. సీట్లు బ్లాక్ చేసే ఉద్దేశ్యంతో ఈ రకంగా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. 

kaloji University Register gives complaint against suspect admissions in Medical seats
Author
Warangal, First Published Apr 19, 2022, 1:33 PM IST

వరంగల్: మెడికల్ కాలేజీల్లో MBBS, పీజీ సీట్లను బ్లాక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే అనుమానంతో కాళోజీ హెల్త్ యూనివర్శిటీ రిజిష్ట్రార్ ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

kaloji University పరిధిలో 26 మెడకిల్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో ప్రస్తుతం ఆడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ తరుణంలో మెరిట్ విద్యార్ధులు కూడా మేనేజ్ మెంట్ కోటా కింద ధరఖాస్తులు చేసుకొన్నారు. అయితే ఈ విషయమై అనుమానం వచ్చిన కాళోజీ హెల్త్ యూనివర్శిటీ రిజిష్ట్రార్ Merit విద్యార్ధులను ఈ విషయమై లేఖ రాశాడు. 

అయితే  తాము మేనేజ్ మెంట్ కోటా కింద ధరఖాస్తు చేయలేదని వారు చెప్పడంతో యూనివర్శిటీ అధికారులకు అనుమానం వచ్చింది. మెరిట్ స్టూడెంట్స్ పేరుతో వేరే వ్యక్తులు ఎవరైనా ఈ పని చేశారా అనే విషయమై కాళోజీ యూనివర్శిటీ అధికారులు అనుమానంతో ఉన్నారు. ఈ విషయమై వాస్తవాలు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజ్ మెంట్ కోటా లో ఎంక్యూ1,2, 3 కింద సీట్లను భర్తీ చేస్తారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన మెరిట్ విద్యార్ధులతో మేనేజ్ మెంట్ కోటా  సీట్ల కోసం ధరఖాస్తు చేయించిన విషయాన్ని కాళోజీ యూనివర్శిటీ అధికారులు గుర్తించారు. సీట్లను బ్లాక్ చేసే ఉద్దేశ్యంతో ఇలా చేశారా అనే అనుమానాన్ని యూనివర్శిటీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ యూనివర్శిటీ పరిధిలో 2295 మెడికల్ సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటాతో పాటు మేనేజ్ మెంటో కోటా కింద సీట్లను భర్తీ చేస్తారు. మెరిట్ స్టూడెంట్ తొలుత మేనేజ్ మెంట్ కోటా కింద ధరఖాస్తులు చేయించి ఆ తర్వాత చేరకుండా వెళ్లిపోతున్నారు.  దీంతో ఈ సీటు బ్లాక్ అవుతుంది. ఇలా బ్లాక్ అయిన సీటును చివర్లో మేనేజ్ మెంట్ కోటి నుండి 2 కోట్లకు విక్రయించుకొనే వీలుంది. ఈ కారణంగానే మెరిట్ విద్యార్ధులతో మేనేజ్ మెంట్ కోటాలో ధరఖాస్తు చేయించారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అయితే మెడికల్ సీట్లను బ్లాక్ చేసే ఉద్దేశ్యంతోనే ఇలా చేశారా లేదా ఇతరత్రా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. 

దేశ వ్యాప్తంగా ఆడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ఒకే రకమైన సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తుండడంతో ఈ విషయం వెలుగు చూసింది. కాళోజీ యూనివర్శిటీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేయనున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios