తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్న ఇద్దరు ఉత్తరాది వ్యక్తులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులు సిరిసిల్ల జిల్లాలో వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సిరిసిల్ల పట్టణ శివారులో సొరంగం నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కూలీలు కూడా పనిచేస్తున్నారు.
అయితే మంగళవారం రాత్రి ఈ సొరంగంలో పని చేసేందుకు సుకేందర్ సింగ్, చందన్ రాయ్ అనే ఇద్దరు కూలీలు వెళ్లారు. అర్థరాత్రి సమయంలో పని ముగించుకుని అక్కడే పడుకున్నారు. ఈ సమయంలో సొరంగంలోకి వచ్చిన ఓ టిప్పర్ పడుకున్న వీరిద్దరిపై నుండి దూసుకెళ్లింది. చీకట్లో వీరిని టిప్పర్ డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో వారిద్దరు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానికి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.