కూటమి అధికారంలోకి వస్తే తానే సీఎం అని కూటమి అభ్యర్థులంతా చెప్పుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ప్రతి జిల్లాలో ముగ్గురు అభ్యర్థులు తామే సీఎం క్యాండిడేట్ అని ప్రచారం చేసుకుంటున్నారని కడియం అన్నారు.

టీఆర్ఎస్ ని ఎదుర్కొనే సత్తాలేక మహాకూటమి పేరుతో కాంగ్రెస్ ప్రజల ముందుకొస్తోందన్నారు. మహాకూటమి ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ చేసి తప్పు అని అభిప్రాయపడ్డారు. కూటమి కారణంగా కాంగ్రెస్ చాలా నష్టపోతుందన్నారు. కనీసం నియోజకవర్గంలో గెలిచే సత్తాలేని వాళ్లు కూడా తామే సీఎం అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

ఒకప్పుడు కాంగ్రెస్, చంద్రబాబుని విమర్శించిన కొందరామే.. ఇప్పుడు వాళ్లతో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తామే కచ్చితంగా గెలుస్తామని ఈ సందర్భంగా కడియం ధీమా వ్యక్తం చేశారు.