హైదరాబాద్: తాను కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కడియం శ్రీహరి ఖండించారు. తన కూతురు కావ్య కూడా కాంగ్రెసులో చేరబోదని ఆయన స్పష్టం చేశారు. తాను నిజాయితీకి కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. 

తనపై తప్పుడు ప్రచారం చేసేవారిని వదిలిపెట్టబోనని, వారిపై కేసులు పెడుతానని కడియం శ్రీహరి హెచ్చరించారు. దోపిడీ దొంగలంతా కాంగ్రెసులో ఉన్నారని ఆయన విమర్శించారు. 

తమ పార్టీ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించకుండానే కాపీ కొట్టారంటూ మాట్లాడడం‌ విడ్డూరంగా ఉందని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. 

సంబంధిత వార్త

కడియం శ్రీహరికి ఇంటి పోరు: కూతురు కావ్య తిరుగుబాటు?