అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణ సచివాలయం ప్రారంభించాలి: హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

తెలంగాణ సచివాలయాన్ని  కేసీఆర్ పుట్టిన రోజున కాకుండా  ఏప్రిల్  14న ప్రారంభించేలా  ఆదేశాలివ్వాలని  హైకోర్టులో  ప్రజాశాంతి  పార్టీ అధ్యక్షుడు  కేఏ పాల్  పిటిషన్ దాఖలు  చేశారు.  
 

KA Paul Files Petition In Telangana High Court For Telangana Secretariat To inaugurate on April 14

హైదరాబాద్: తెలంగాణ సచివాలయాన్ని  కేసీఆర్ పుట్టిన రోజున కాకుండా అంబేద్కర్  జయంతి రోజున ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని    ప్రజా శాంతి  పార్టీ చీఫ్  కేఏ పాల్  తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల  17వ తేదీన  తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  తెలంగాణ సచివాలయానికి  అంబేద్కర్ పేరు పెట్టారు . అంబేద్కర్ పేరు పెట్టినందున  సచివాలయాన్ని ఏప్రిల్  14న ప్రారంభించాలని  ఆ పిటిషన్ లో  కేఏ పాల్ కోరారు.  ఈ పిటిషన్ లో ప్రతి వాదులుగా సీఎంఓ, చీఫ్ సెక్రటరీ లను  కేఏ పాల్  చేర్చారు.  

తెలగాణ సచివాలయానికి  అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ ను ప్రజా గాయకుడు గద్దర్ కోరారు.  ఈ మేరకు  రాష్ట్ర ప్రభుత్వానికి గద్దర్ వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై  ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కొత్త  సచివాలయానికి  అంబేద్కర్ భవన్ గా నామకరణం చేశారు.   అంబేద్కర్ పేరు పెట్టి  అంబేద్కర్ జయంతి రోజున కాకుండా  కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ప్రారంభించడం ఏమిటని కేఏ పాల్ ప్రశ్నిస్తున్నారు.  

తెలంగాణ సచివాలయాన్ని  ఈ నెల  17వ తేదీన ప్రారంభించాలని ఈ ఏడాది జనవరి  15వ తేదీన  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  అన్ని హంగులతో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ భావించారు. ఈ మేరకు  2019  జూన్  27న కొత్త సచివాలయ నిర్మాణ పనులకు  కేసీఆర్ భూమి పూజ చేశారు.  ఏడు లక్షల చదరపు అడుగుల స్థలంలో  కొత్త సచివాలయాన్ని నిర్మించారు.   తొమ్మిది మాసాల్లో  సచివాలయ నిర్మాణ పనులను  ప్రారంభించాలని  తలపెట్టారు. కానీ   కరోనా కారణంగా  నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి.   గత ఏడాది దసరాకే  కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ దసరా నాటికి  సచివాలయ పనులు  పూర్తి కాలేదు. దీంతో  ఈ నెల  17న ఈ భవనాన్ని ప్రారంభించాలని ముహుర్తం  ఫిక్స్ చేశారు. 

also read:తెలంగాణ సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారు:కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సెక్రటేరియట్ ప్రారంభం

ఈ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్,  జార్ఖండ్  సీఎం  హేమంత్  సోరేన్ లను  కూడా సీఎం  కేసీఆర్ ఆహ్వానం పలికారు. అదే రోజున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.  ఈ సభలో   బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలు పాల్గొంటారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios