Asianet News TeluguAsianet News Telugu

కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం.. హైకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్..

తెలంగాణలో కొత్తగా  నిర్మించిన సచివాలయంలో ఇటీవల అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. 

KA Paul approach telangana high court over new secretariat fire accident
Author
First Published Feb 6, 2023, 3:36 PM IST

తెలంగాణలో కొత్తగా  నిర్మించిన సచివాలయంలో ఇటీవల అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తాను దాఖలు చేసిన పిల్ విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని కేఏ పాల్.. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌కు తెలిపారు. ఈ క్రమంలోనే స్పందించిన సీజే కేఏ పాల్ పిల్‌కు నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్టార్‌కు ఆదేశించారు. 

ఇక, తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ను ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారవర్గాలు తెలిపాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమిటనేది స్పష్టంగా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. 11 అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

ఈ ప్రమాదంపై స్పందించిన కేఏ పాల్.. నిర్మాణంలో ఉన్న సచివాలయం చూసేందుకు తాను వెళ్తానంటే అడ్డుకున్నారని అన్నారు. తాను వద్దనాన్నని.. దేవుడు కూడా వద్దని అనుకున్నాడని.. అందుకే సచివాలయం కాలిపోయిందని చెప్పుకొచ్చారు. తనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెప్పారు. దేవుడు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాడని అన్నారు. దేవుడికి నచ్చకనే సెక్రటేరియట్‌కు వ్యతిరేకంగా నిలబడ్డాడని కామెంట్ చేశారు. కేసీఆర్ అవినీతి ఎంతో కాలం చెల్లదని.. ఇప్పటికైనా పశ్చాత్తాపడి మారాలని అన్నారు. కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగా గెలవలేరని విమర్శించారు. అలాంటి వ్యక్తి ప్రధాని అవుతారా? అని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ జయంతి రోజే కొత్త సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios