తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ తరపున కె. నవీన్ రావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట వున్న నవీన్ రావు తెర వెనుక నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది.

దీంతో ఆ స్థానానికి నవీన్‌రావును పార్టీ అభ్యర్ధిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ కనుక నామినేషన్ దాఖలు చేయకపోతే నవీన్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు.