కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందో ముందే చెప్తున్న జూపల్లి

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 7, Sep 2018, 4:08 PM IST
jupally krishna rao on congress
Highlights

ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కనీసం రెండంకెల సీట్లు కూడా గెలుచుకోలేదని జోస్యం చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు కోసమే అసెంబ్లీని రద్దు చేశామని జూపల్లి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 14 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని  మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కనీసం రెండంకెల సీట్లు కూడా గెలుచుకోలేదని జోస్యం చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు కోసమే అసెంబ్లీని రద్దు చేశామని జూపల్లి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 14 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ కోసమే అసెంబ్లీ రద్దు చేశామని అందులో అప్రజాస్వామ్యం ఏమీ లేదన్నారు. రాజ్యంగ బద్ధంగానే ఎన్నకలకు వెళ్తామని తమని ప్రజలు ఆదరిస్తారన్నారు. మరోవైపు తమకు పదవులంటే ఆశలేదని గతంలో తెలంగాణ కోసం ఎన్నోసార్లు పదవులు వదులుకున్నామని తెలిపారు.  

loader